సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Manoj: కొత్త జీవితానికి త్వరలో శ్రీకారం

ABN, First Publish Date - 2022-12-16T20:22:58+05:30

‘డైలాగ్ కింగ్’ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). ‘బిందాస్’ (Bindaas), ‘పోటుగాడు’ (Potugadu), ‘వేదం’ (Vedam) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘డైలాగ్ కింగ్’ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). ‘బిందాస్’ (Bindaas), ‘పోటుగాడు’ (Potugadu), ‘వేదం’ (Vedam) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అతడు తాజాగా కడపలోని ప్రఖ్యాత పెద్ద దర్గాను సందర్శించాడు. ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు.

దర్గా విశిష్టత గురించి నిర్వహకులను అడిగి మంచు మనోజ్ తెలుసుకున్నాడు. చాలాకాలంగా పెద్దదర్గాను సందర్శించుకోవాలని ఉన్నా అనివార్య కారణాల వల్ల రాలేకపోయానన్నాడు. నేడు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందన్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపాడు. కుటుంబ సభ్యులతో కలసి మరో మారు పెద్దదర్గాకు వస్తానని చెప్పాడు. కొత్త సినిమాల ప్రాజెక్టులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చేపడుతున్నట్లు వెల్లడించాడు. పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రణీత రెడ్డిని 2015లో మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం అతడు ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియాగా ఈ మూవీని రూపొందిస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మంచు మనోజ్ నుంచి పూర్తి స్థాయి సినిమా రాలేదు.

Updated Date - 2022-12-16T20:23:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!