Manchu Lakshmi: ట్రోల్స్‌పై స్పందించిన నటి
ABN, First Publish Date - 2022-12-24T16:38:46+05:30
సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi). కొత్త రకం కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులతో అలరిస్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi). కొత్త రకం కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులతో అలరిస్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నారు. తనపై వచ్చే ట్రోల్స్‌పై కూడా స్పందించారు.
‘‘నేను మాట్లాడే విధానంపై కొంత మంది విమర్శలు చేస్తుంటారు. వారు నాలా ఉండలేరు కాబట్టే నన్ను వెక్కిరిస్తుంటారు. ఇంట్లో కూర్చుని పని పాట లేకుండా కామెంట్స్ చేసే వాళ్లని నేను పట్టించుకోను. ఈ భూమ్మీద పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలని నేను సీరియస్‌గా తీసుకుంటుంటాను. అందువల్లే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తుంటాను. ట్రోల్స్ గురించి గతంలో బాధపడేదానిని. ప్రస్తుతం నేను అస్సలు బాధపడటం లేదు. ఇప్పుడు అందరూ నాలాగే మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటిలో ఒక లక్ష్మి మంచు ఉంది’’ అని మంచు లక్ష్మి ప్రసన్న చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని ఆమె తెలిపారు. ‘‘మా కుటుంబానికి సంబంధించిన విషయాలను ప్రైవేటుగానే ఉంచుతాం. సమయం వచ్చినప్పుడు మాత్రమే అందరం కలసి కనిపిస్తాం. మా ఇంట్లో ఏం జరుగుతుందనేది మా సొంత విషయం. నేను, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. అందువల్లే బయట మేమిద్దరం కలసి కనిపిస్తాం. విష్ణు కొంచెం భిన్నమైన వ్యక్తి. కుటుంబం, పిల్లలు, వర్క్‌పైనే అతడు ఫోకస్ చేస్తాడు. అందువల్లే మేం ముగ్గురం కలసి కనిపించం’’ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.