Kaikala Satyanarayana: కలిసొచ్చిన ఎన్‌టీఆర్ పోలికలు
ABN, First Publish Date - 2022-12-23T09:24:58+05:30
విలక్షణ విలనీతో భయపెట్టి, యముడిగా నవ్వులు పూయించిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు.
విలక్షణ విలనీతో భయపెట్టి, యముడిగా నవ్వులు పూయించిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడల్లో పూర్తి చేసిన కైకాల.. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో కైకాల వివాహం అవ్వగా.. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరికని ఎప్పుడు చెబుతుండేవారు.
ఇంటర్ చదివే సమయంలోనే కైకాలకి నటన మీద ఆసక్తి కలిగింది. అందుకే ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగానే నాటకరంగంలోకి ప్రవేశించారు. అనంతరం నాటక రంగంలోని అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లారు. మొదటగా ఆయనలోని నటుడిని డి.ఎల్.నారాయణ అవకాశం ఇచ్చారు. అలా తొలి సినిమా ‘సిపాయి కూతురు’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆ సమయంలో స్టార్‌గా వెలుగొందుతున్న ఎన్టీఆర్ పోలికలు కలిసొచ్చాయి. కైకాలను ఎన్టీఆర్‌కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు చాలా అవకాశాలు ఇచ్చారు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్‌తో కలిసి కైకాల నటించారు. ఆ రోజుల్లోనే ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ వంటి పలు చిత్రాలలో ఆయనకు డూప్‌గా కైకాల నటించారు. తన ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన కైకాల నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచారు. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగిన ఆయన 777 పైగా చిత్రాల్లో నటించారు.
కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
చివరి చిత్రం: మహర్షి
పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో పాత్రలతో మెప్పించారు
28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు
200 మందికిపైగా దర్శకులతో పని చేశారు
కైకాల నటించిన సినిమాల్లో 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి
59 సినిమాలు అర్ధ శతదినోత్సవాలు జరుపుకున్నాయి
10 చిత్రాలైతే ఏకంగా సంవత్సరం పాటు ఆడాయి
విఠలాచార్య దర్శకత్వంలో తొలి సారి ప్రతినాయకుడి వేషం వేశారు
కనకదుర్గ పూజ మహిమ చిత్రంతో ప్రతినాయకుడిగా మారారు
ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది
ఎన్టీఆర్‌తో కలిసి కైకాల సత్యనారాయణ 101 చిత్రాల్లో నటించారు
ఎన్టీఆర్‌తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించి మెప్పించారు
యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు
పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించారు
సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించారు
రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ
కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు
1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు
2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.
నీవా పాండవ పత్ని.. సంభాషణ అంటే కైకాల చాలా ఇష్టం
1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యా