సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rip Kaikala Satyanarayana: గుర్తించకపోవడం బాధాకరమే!

ABN, First Publish Date - 2022-12-23T13:31:50+05:30

ఉత్తమ నటుడిగా, విలన్‌గా అనేక పురస్కారాలు అందుకొన్న సత్యనారాయణ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ కూడా పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన ఆయనకు ఇది సముచిత పురస్కారమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తమ నటుడిగా, విలన్‌గా అనేక పురస్కారాలు అందుకొన్న సత్యనారాయణ (Kaikala satyanarayana) తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ కూడా పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన ఆయనకు ఇది సముచిత పురస్కారమే(no Padma awards). అయితే పద్మశ్రీ, పద్మభూషణ్‌ వంటి అత్యున్నత పురస్కారాలు అందించే కేంద్రప్రభుత్వం సత్యనారాయణ వంటి ప్రతిభాశాలిని ఇంతవరకూ గుర్తించకపోవడం(No recognization from govt) దురదృష్టకరమే.

అగ్ర హీరోలతో సొంత సినిమాలు (Movie production)

సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావుకు నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనే కోరిక ఉండేది. అందుకే ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో ‘గజదొంగ’ చిత్రాన్ని తొలిసారిగా తన సమర్పణలో నిర్మించారు సత్యనారాయణ. ఈ చిత్రానికి నాగేశ్వరరావు, చలసాని గోపి నిర్మాతలు. ఆ తర్వాత రమా ఫిల్మ్స్‌ సంస్థను నెలకొల్పి కృష్ణ, శోభన్‌బాబులతో ‘ఇద్దరు దొంగలు’, తన కుమారులు లక్ష్మీనారాయణ, రామారావు నిర్మాతలుగా చిరంజీవితో ‘చిరంజీవి’ చిత్రాలు నిర్మించారు. శోభన్‌బాబుతో ‘అడవిరాజా’, చిరంజీవితో ‘కొదమసింహం’, అక్కినేనితో ‘బంగారు కుటుంబం’, బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’ చిత్రాలు నిర్మించారు సత్యనారాయణ.

దర్శకేంద్రుడితో ఎక్కువ చిత్రాలు... (K raghavendrarao)

దాదాపు 800 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ ప్రముఖ దర్శకులందరితోనూ పని చేశారు. వీరిలో ఎక్కువ శాతం .. అంటే 49 చిత్రాలు రాఘవేంద్రరావుతో చేయడం ఒక విశేషం. అలాగే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సీరియల్‌లో కూడా నటించారు సత్యనారాయణ. ఆ తర్వాత యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా పేరొందిన కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో 35 చిత్రాల్లో నటించారు. దాసరి దర్శకత్వంలో ఆయన 34 చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమలో తనకు గాడ్‌ ఫాదర్‌ లాంటి ఎన్టీఆర్‌ దర్శకత్వంలో 11 సినిమాల్లో నటించారు.

ఒకే ఏడాది 35 చిత్రాలు...

1970-90 వరకూ తెలుగు సినిమాల్లో ప్రధాన విలన్‌గా ఆయన ఓ వెలుగు వెలిగారు. 1984లో సత్యనారాయణ నటించిన 35 చిత్రాలు విడుదలయ్యాయంటే ఆ రోజుల్లో ఆయనెంత బిజీనో అర్ధం చేసుకోవచ్చు. రోజుకి ఐదారు షూటింగ్స్‌లో పాల్గొనేవారు. ఆయన కోసం హీరోలు సెట్‌లో ఎదురు చూసిన సందర్భాలూ ఉన్నాయి. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. కడుపారా తినడానికి టైమ్‌ ఉండేది కాదు. ఆరు పదుల నటజీవితంలో, ఐదు తరాల హీరోలతో, వందలాది విభిన్న పాత్రలు పోషించి, చరిత్ర సృష్టించారు. ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యం.

యు. వినాయకరావు

Updated Date - 2022-12-23T13:48:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!