Kaikala Satyanarayana: ఎన్టీఆర్ నిజంగానే కత్తితో పొడిచారు!
ABN, First Publish Date - 2022-12-23T17:46:30+05:30
హీరో, విలన్, కమెడీయన్ ఇలా కైకాల సత్యనారాయణ చేయని పాత్రలేదు. జానపదమైనా, పౌరాణికమైనా, సంఘికం ఇఆ టచ్ చేయని జానర్ లేదు. పాత్ర ఎదైనా తనదైణ మార్కును వెండితెరపై చూపించారు.
హీరో, విలన్, కమెడీయన్ ఇలా కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana)చేయని పాత్రలేదు. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికం అయినా ఆయన చేయని జానర్ లేదు. పాత్ర ఎదైనా తనదైన మార్కును వెండితెరపై చూపించారు. దాదాపు ఐదు తరాల నటులతో నటించారు. ఆరు పదుల వయసు వరకూ ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు. 800లకు పైగా చిత్రాలతో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సూపర్‌స్టార్ స్టాటస్ తెచ్చుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవరసా నటన సార్వభౌమగా ఎదిగారు. పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచారు. కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా విలనిజంలోనూ వినోదం పండించి వైవిధ్యానికి మారు పేరుగా నిలిచారు. 2011లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. వైవిధ్యమైన పాత్రలతో లక్షలాది మంది ప్రేక్షకులనే అలరించిన ఆయనకు ఇప్పటికీ పద్మ పురస్కారం దక్కలేదు. ‘‘నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల అవార్డులు రాలేదు. కానీ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అంతకు మించిన అవార్డు ఇంకేం ఉంటుంది. నాకు అది చాలు’’ అని అన్నారు. అలాగే పలు సందర్భాల్లో కైకాల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నా నట సినిమా జీవితంలో ఒక ప్రమాదకరమైన, వినోద సంఘటన ఉంది. ఓ రోజు మద్రాస్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని అలసి నోమి ఇంటికి వచ్చాను. మా పని మనిషి కాఫీ తీసుకోచ్చింది. బాగా అలిసిపోవడంతో చకచకా తాగేశాను. గ్లాస్ అడుగున సాలీడు ఉంది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. మా వాళ్లంతా డాక్టర్ దగ్గరకు వెళ్లమని హడావిడి చేశారు. అదృష్టం బాగుంటే బతికి బయట పడతాను అనుకుని దేవుడి మీద భారం వేసిఇ నిద్రపోయా. బై లక్ పొద్దునే ఎప్పటిలాగే లేచి కూర్చున్నా. హమ్మయ్య అనుకున్నా’’ అని అన్నారు.
కల అలా నెరవేరింది...
‘‘దుర్యోధనుడి పాత్ర వేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. అది ‘కృష్ణావతారం’తో తీరింది. ఆ పాత్ర కోసం తొలుత ఎస్.వి.రంగారావు గారిని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన డేట్స్ కుదరలేదు. ఆ తర్వాత చాలామందిని అనుకున్నారు. చివరికి నేను సరిపోతాననుకున్నారు. అలా దుర్యోధనుడి పాత్ర వేయాలనే కోరిక నెరవేరింది’’.
యముడు అంటే ఆయనే...
యముడి పాత్రలకు పెట్టింది పేరుగా కైకాల గుర్తింపు పొందారు. యమగోల నుంచి రవితేజ నటించిన దరువు వరకూ యముడిగా నటించి, యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించారు. ఆయన కాకుండా మరికొందరు యముడి పాత్రలు పోషించారు కానీ కైకాల తరహాలో ఎవరూ మెప్పించలేకపోయారు. జనాల్లో యముడు అంటే ఆయనే అన్నంతగా ముద్ర పడింది. ఆయన నటించిన చివరి చిత్రం ‘మహర్షి’. అందులో పూజా హెగ్డే తాతయ్యగా, అతిథి పాత్రలో కనిపించారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’లో దర్శకుడు హెచ్.యమ్. రెడ్డి పాత్రలో మెరిశారు. ‘యమలోగ’ చిత్రంలో మొదటిసారి యముడిగా నటించా. ఆ పాత్ర ఎంతగానో గుర్తింపు తెచ్చింది. తర్వాత చిరంజీవితో ‘యముడికి మొగుడు’ చేశా. ‘పిట్టలదొర’, ‘యమలీల’, ఇలా ఏ సినిమాలోనైనా యముడి పాత్ర అంటే నన్నే తీసుకునేవారు. ‘యమదొంగ’లోనూ అవకాశం వచ్చింది. కొన్ని కారణాల వల్ల చేయలేదు’’.
ఎన్టీఆర్ కత్తితో పొడిచారు...
‘‘హీరోగా కెరీర్ మొదలపెట్టినా ఆ తర్వాత ఎక్కువ విలనీ ఎక్కువ చేశా. విలన్‌గా చేేస్త బాగుంటుందని చెప్పి నాకు తొలిసారి ప్రతినాయకుడి వేషం ఇచ్చింది విఠలాచార్య గారే. విలన్ అంటే శారీరకంగా ఎంతో బాధపడాలి. రామారావు నటించిన ఎన్నో చిత్రాల్లో నేను ప్రతినాయకుడిగా నటించా. ఆయనతో ఫైట్ అంటే గండం గడచినట్లే. ఓసారి నిజంగానే ఆయన కత్తితో పొడిచేశారు. టైమింగ్ కుదరకపోతే ఆయన ఊరుకోరు. భీమ-కీచకుల యుద్థంలో భాగంగా ఇద్దరం తలపడ్డాం. ఆయన నా రొమ్ము మీద గుద్దుతుంటే చచ్చినంత పనైంది’’.
అప్పుడు కళ కోసం ఇప్పుడు కాసుల కోసం...
‘‘ఒకప్పటికీ ఇప్పటికీ కథల, తెరకెక్కించే తీరులో చాలామార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నటీనటుల ప్రవర్తన, గౌరవ మర్యాదలు చూస్తే చాలా అసంతృప్తిగా అనిపించింది. అసలు అప్పటి సినిమాకు ఇప్పటికీ పొంతన లేదు. గతంలో పారితోషికం కూడా హీరోలకు, మాకు దాదాపు సమానంగానే ఉండేది. హీరో ఒక సినిమా చేేస లోపు.. మేము మూడు, నాలుగు సినిమాలు చేసేవాళ్లం. ఇప్పుడు విపరీతంగా పారితోషికం పెంచేస్తున్నారు. నాడు కళ కోసం చూసుకుంటే.. నేడు కాసుల కోసం చూసుకుంటున్నారు. ఇది నచ్చక.. నటనకు కాస్త దూరమయ్యాను. క్షణం తీరిక లేకుండా పని చేసినప్పుడు నాలుగు రోజులు ఎక్కడికైనాపారిపోయి నిద్రపోవాలనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ బాధ లేదు’’ అని కైకాల పాత రోజుల్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.