Kaikala Satyanarayana : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు!
ABN, First Publish Date - 2022-12-24T12:23:46+05:30
విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని కైకాల స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.
విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana)అంత్యక్రియలు(Cremations) ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని కైకాల స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. సినీ ప్రముఖులు, వందలాది అభిమానులు కైకాల చివరి చూపు కోసం తరలివచ్చారు. కైకాల పెద్ద తనయుడు లక్ష్మీనారాయణ తంతు నిర్వహించగా మహాప్రస్ధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే!