సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Waltair Veerayya: అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతం

ABN, First Publish Date - 2022-12-27T18:20:16+05:30

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల...

Harbour Set For Waltair Veerayya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ షూటింగ్ జరుగుతోంది. రీసెంట్‌గా యూరప్‌లో షూట్ చేసిన ‘శ్రీదేవి చిరంజీవి’ (Sridevi Chiranjeevi) సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాట ట్రెండింగ్‌లో ఉండగానే.. ‘వీరయ్య’ టైటిల్ ట్రాక్‌ను సోమవారం మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా చిత్రయూనిట్ అల్యూమినియం ఫ్యాక్టరీ (Aluminium Factory)లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఫ్యాక్టరీలో సినిమా కోసం హార్బర్ సెట్‌ (Harbour Set)ను నిర్మించారు. ఈ సెట్ చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటే నమ్మాలి. ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఈ సినిమాకు ఏఎస్ ప్రకాష్ (AS Prakash) ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇంతకు ముందు ఈ సెట్ గురించి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఈ సెట్ అద్భుతంగా ఉంటుందని తెలుపుతూ.. ప్రొడక్షన్ డిజైనర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ సెట్‌ని ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సెట్ చూసిన వారంతా.. హైదరాబాద్‌‌లో సముద్రం, హార్బర్ లేదని ఎవరన్నారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే.. ఎంత అద్భుతంగా ఈ సెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో హార్బర్ సెట్ ఫొటోలు

Updated Date - 2022-12-27T18:23:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!