సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dil Raju: విజయ్ అభిమానులతో ఈ సంక్రాంతి మనదే అంటున్న నిర్మాత

ABN, First Publish Date - 2022-12-25T20:27:05+05:30

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘వారిసు’ (Varisu). రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘వారిసు’ (Varisu). రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియోను లాంచ్ చేసింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు అనేక మంది సెలబ్రిటీలు, భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. వేడుకను ఉద్దేశించి దిల్ రాజు (Dil Raju) ప్రసంగించాడు. ఈ చిత్రం తల్లిదండ్రులందరికీ అంకితమని చెప్పాడు.

‘‘వారిసు సినిమా రీమేకా? సీక్వెలా? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈ చిత్రం రీమేక్ కాదు. సీక్వెల్ కాదు. తల్లిదండ్రులందరికి ఈ మూవీని అంకితమిస్తున్నాం. ఇది పక్కా తమిళ్ ఫిల్మ్. ఈ సినిమాలో ఫన్, యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన పాటలు, డ్యాన్స్‌లు ఉంటాయి. ఈ సంక్రాంతి మనదే’’ అని దిల్ రాజు తెలిపాడు. వారిసు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, జయ సుధ, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, యోగి బాబు, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-12-25T20:27:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!