సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

18 pages: ట్రైలర్ లో కనపడిన బ్రహ్మాజీని, సినిమాలో లేపేశారు ఎందుకో...

ABN, First Publish Date - 2022-12-26T18:16:55+05:30

అల్లు అరవింద్ సినిమా చూసి సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గిందని చివరి నిముషం లో బ్రహ్మాజీ (In the last minute they shot few scenes on Brahmaji) ని పెట్టి నాలుగు అయిదు సీన్స్ షూట్ చేసారు అని తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) దర్శకత్వం లో '18 పేజెస్' (18 Pages) అనే సినిమా గత వారం విడుదల అయింది. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ (NIkhil Siddhartha and Anupama Parameshwaran is the lead pair) ఇందులో లీడ్ పెయిర్ గా నటించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి కథ అందించారు. అలాగే ఇంకో ప్రముఖ సంస్థ గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. బన్నీ వాస్ దీనికి నిర్మాత (Bunny Vaas is the producer). అయితే ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల డిసెంబర్ 23 అని ప్రకటించిన తరువాత, అల్లు అరవింద్ సినిమా చూసి సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ తగ్గిందని చివరి నిముషం లో బ్రహ్మాజీ (In the last minute they shot few scenes on Brahmaji) ని పెట్టి నాలుగు అయిదు సీన్స్ షూట్ చేసారు అని తెలిసింది. అంటే విడుదలకి ఒక నాలుగు అయిదు రోజులు ముందు అన్నమాట. సు

కుమార్, దర్శకుడు సూర్య ప్రతాప్, అల్లు అరవింద్ (Allu Aravind), బన్నీ వాస్ అందరూ ఈ సీన్స్ చూసి చాల హ్యాపీ ఫీల్ అయ్యారట కూడా. సెకండ్ హాఫ్ లో ఈ కామెడీ సీన్స్ వలన సినిమా లాగుతుంది అని కూడా అన్నారు అని తెలిసింది. తీరా సినిమా విడుదల అయ్యాక, బ్రహ్మాజీ సీన్స్ మొత్తం లేపేశారు. ఎందుకో మరి తెలీదు. ఆసక్తికర అంశం ఏంటి అంటే, బ్రహ్మాజీ ట్రైలర్ లో కనపడతాడు (Brahmaji appeared only in the trailer, but not in the film), అలాగే విదేశాల్లో విడుదలయిన సినిమాలో కూడా కనపడతాడు, కానీ ఇండియా లో కనపడడు. అయితే విదేశాలకి ప్రింట్ రెండు మూడు రోజుల ముందు పంపాలి కాబట్టి, అందులో బ్రహ్మాజీ సీన్స్ తీయలేక పంపేశారు. ఈలోపు దర్శక నిర్మాతలు తమ ఆలోచనలు మార్చుకొని, ఇక్కడ ఇండియా లో బ్రహ్మాజీ సీన్స్ తీసేసారు. అసలు ఈ సినిమా మూలన పడేసారు, కానీ మళ్ళీ బూజు దులిపి బయటకి తీసుకు వచ్చారు, ఎందుకంటే, నిఖిల్ 'కార్తికేయ 2' బ్రహ్మాండంగా ఆడింది కాబట్టి. లేకపోతే దీన్ని అలాగే బుట్టలో ఉంచేసేవారు. ఇంతకీ బ్రహ్మాజీ సీన్స్ మళ్ళీ యాడ్ చేస్తారా, లేక ఓటిటి లో అయినా ఉంటాయా అని అంటున్నారు.

Updated Date - 2022-12-26T18:20:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!