సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla Ganesh: బండ్ల నోటి నుండి బూతు

ABN, First Publish Date - 2022-12-30T13:47:27+05:30

నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Producer and actor Bandla Ganesh is in the news again) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు, ఉండాలని అనుకుంటాడో ఏమో మరి, అందుకే కొంచెం వివాదాస్పదంగా మాట్లాడటం, ట్వీట్ చెయ్యటం చేస్తూ ఉంటాడు.

ధమాకా విజయ సదస్సు లో బండ్ల గణేష్ స్పీచ్ ఇరగ దె***
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Producer and actor Bandla Ganesh is in the news again) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు, ఉండాలని అనుకుంటాడో ఏమో మరి, అందుకే కొంచెం వివాదాస్పదంగా మాట్లాడటం, ట్వీట్ చెయ్యటం చేస్తూ ఉంటాడు. నిన్న జరిగిన 'ధమాకా' (Dhamaka success meet) విజయ సదస్సుకి బండ్ల గణేష్ ముఖ్య అతిధిగా (Special guest) హాజరయ్యాడు. బండ్ల గణేష్ మాట్లాడటానికి మైక్ ఇవ్వగానే ఇంకా దర్శకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు సినిమా ఇరగ దె.... సార్ (ఆ బూతు పదం ఇక్కడ రాయడానికి కూడా ఆవంతగా అన్నాడు) అని బండ్ల బూతులు ఎత్తుకున్నాడు (Bandla praises the director with vulgar words). ఇలా పబ్లిక్ మీటింగ్ లో ఒక సెలబ్రిటీ అయినా బండ్ల గణేష్ ఆలా ఎలా మాట్లాడుతాడు, అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అది కాకుండా ఈ మొత్తం ఈవెంట్ అంత ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. (He spoke these vulgar words in a live and public event)

ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ లో బండ్ల గణేష్ బూతు పురాణం మాట్లాడటం అందరిని షాక్ కి గురి చేసింది. బండ్ల గణేష్ అంటే, ఎదో ఒకటి నోటికి వాచినట్టు మాట్లాడుతుంటాడు అని పరిశ్రమలోనూ, బయట అందరికి తెలిసిన విషయమే అయినా, మరీ అంత పచ్చిగా అంత మంది జనం మధ్యలో, అంతమంది సెలబ్రిటీస్ కూర్చుని ఉండగా ఆలా మాట్లాడటం అతని వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చుకునే తట్టు అవుతుంది కానీ అతనికి ఈ విధంగానూ హెల్ప్ అవదు. తరువాత ట్విట్టర్ వేదికగా బండ్ల సారీ చెప్పాడు, కానీ ఈమధ్య ఏంటో అందరికీ ఇదో ఫ్యాషన్ అయిపొయింది. బూతులు మాట్లాడటం, సారీ చెప్పటం. (Bandla says sorry on his twitter about these vulgar words)

బండ్ల మామూలుగా ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జపం చేస్తూ ఉంటాడు, అలాగే పవన్ నా దేవుడు అని పొగుడుతూ వుంటాది, కానీ ఈసారి రవితేజ (Ravi Teja) ని ఆకాశానికి ఎత్తేసాడు. బండ్ల ఏంటి రవితేజ ని ఎందుకు ఇంతలా పొగుడుతున్నాడు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు కూడా. అలాగే సాంఘీక మాధ్యమాల్లో ఇంకా బండ్ల ఈ బూతు క్లిప్పింగ్ ని పెట్టి నెటిజన్స్ ఆడుకుంటున్నారు. చాలా కామెడీ కూడా చేసుకుంటున్నారు.

Updated Date - 2022-12-30T13:47:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!