సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla ganesh: రవితేజ అంటే రాజసం...

ABN, First Publish Date - 2022-12-30T13:08:38+05:30

బండ్ల గణేశ్‌ వేదికపై మైక్‌ పట్టాడంటే మాటలకు కొదవ ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు లిమిట్‌ ఉండదు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ సక్సెస్‌ పార్టీలో ఆయన పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండ్ల గణేశ్‌ (Bandla ganesh Speech) వేదికపై మైక్‌ పట్టాడంటే మాటలకు కొదవ ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు లిమిట్‌ ఉండదు. రవితేజ (Raviteja) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ (Dhamaka) సక్సెస్‌ పార్టీలో ఆయన పాల్గొన్నారు. రవితేజను పొగడ్తల్లో ముంచేశారు . రవితేజ సూర్యుడిలాంటి వాడు. రవితేజ చాలామందికి ఇన్స్పిరేషన్‌. ఇంటెగ్రిటీ, రాయల్టీ, లాయల్టీ, రియాలిటీ, రాజసం అంటూ కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘ధమాకా’ సక్సెస్‌ మీట్‌లో బండ్ల గణేశ్‌ పాల్గొన్నారు. ఆ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘ఈ వేడుకకు నేను వస్తానని చిత్ర బృందానికి ఫోన్‌ చేసి చెప్పా. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడేందుకు వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. తాను నటించిన 70 చిత్రాల్లో.. 12 మంది దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కష్టం తెలిసిన వ్యక్తి రవితేజ. ఎవరైనా ఓ పనిలో సక్సెస్‌ కావడానికి ఒకటి, రెండే లేదా మూడేళ్లు ప్రయత్నిస్టారు. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి స్టార్లుగా ఎదుగుతారు. ప్రయత్న లోపం లేకుండా పదేళ్లయినా ఇక్కడే ఉండి తానేంటో నిరూపించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎప్పటికప్పుడు.. ‘రవితేజ పని అయిపోంది’ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ, ఆయన ఎప్పుడూ వెలుగుుతూనే ఉంటాడు. ఫ్లాప్స్‌ ఇచ్చిన దర్శకుడికి కూడా మళ్లీ అవకాశమిస్తాడు. అదీ రవితేజ అంటే! ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ’’ అని బండ్ల గణేశ్‌ అన్నారు.

‘ధమాకా’ చిత్రానికి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. మనం పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇక పండక్కి గ్యాప్‌ ఇవ్వొద్దు. వరుసగా పండగ మీద పండగ చేసుకోవాలి’’ అని రవితేజ అన్నారు.

Updated Date - 2022-12-30T13:08:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!