Lokesh Kanagaraj: విజయ్ మూవీ ఓటీటీ రైట్స్‌కు సౌతిండియన్ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!
ABN, First Publish Date - 2022-12-26T16:53:46+05:30
విజయ్, లోకేశ్ కనకరాజ్ సినిమా వర్కింగ్ టైటిల్‌గా ‘దలపతి 67’ అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు విజయ్ (Vijay). చివరగా ‘బీస్ట్’ (Beast) లో నటించాడు. ఈ చిత్రం ప్రేక్షకును ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల హిట్ కొట్టాలని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి ఒకే చెప్పాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ (Varisu) లో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. తెలుగులోను వారసుడు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉండగానే లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj)తో సినిమా చేయడానికి ఇళయ దలపతి అంగీకరించాడు. డిసెంబర్‌లోనే చిత్రీకరణ ప్రారంభం కావాలి. కానీ, వారసుడు షూటింగ్ పూర్తి కాకపోవడంతో లోకేశ్ సినిమా పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తాజాగా విజయ్-లోకేశ్ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది.
విజయ్, లోకేశ్ కనకరాజ్ సినిమా వర్కింగ్ టైటిల్‌గా ‘దలపతి 67’ అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి ‘దలపతి 67’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. ఓటీటీ రైట్స్ కోసం రూ.160కోట్ల భారీ ధర చెల్లించిందని సమాచారం. సౌతిండియన్ ఇండస్ట్రీలోనే ఒక మూవీ ఓటీటీ రైట్స్‌కు లభించిన అత్యధిక ధర ఇదేనట. ‘దలపతి 67’ పాన్ ఇండియాగా రూపొందుతుండటంతో ఇంత ధర చెల్లించిందట. సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లోను మంచి క్రేజ్ ఉంది.