Trisha: అంతర్జాతీయ సమస్యతో.. యాక్షన్‌లోకి త్రిష!
ABN, First Publish Date - 2022-12-18T11:14:50+05:30
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న త్రిష (Trisha)... ఇపుడు యాక్షన్‌కు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న త్రిష (Trisha)... ఇపుడు యాక్షన్‌కు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘రాంగీ’ (Raangi) చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదలకానుంది. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ (AR Murugadoss) కథను సమకూర్చగా ‘ఇవన్ వేరే మాదిరి’ ఫేం ఎం.శరవణన్ (M Saravanan) దర్శకత్వం వహించారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానరుపై నిర్మించారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక స్టన్నింగ్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఈ మూవీ విడుదలను పురస్కరించుకుని దర్శకుడు శరవణన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘త్రిష (Trisha Krishnan)ను దృష్టిలో పెట్టుకునే ఈ స్టోరీని డెవలప్ చేశాం. కథను మురుగదాస్ అందించారు. ఇందులో త్రిష ఒక జర్నలిస్టుగా నటించారు. ఆపదలో చిక్కుకున్న ఆమె అన్న కుమార్తెను రక్షించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఈ సమస్య అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అది ఏంటి? ఎందుకు అంత పెద్ద సమస్యగా మారింది? సమస్యకు పరిష్కారం లభించిందా? లేదా అన్నదే మిగిలిన కథ. ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందిన స్టోరీ కాదు. ఒక అంతర్జాతీయ సమస్యను చెప్పాం. అందుకే 30కి పైగా డైలాగులు మ్యూట్ చేయడం జరిగింది. సినిమాను రిలీజ్ చేసి తీరాలన్న నిర్బంధ పరిస్థితిలో సెన్సార్ సభ్యుల సూచనలను అంగీకరించాల్సి వచ్చింది. ఇది మనస్సుకు చాలా కష్టంగా ఉంది. అనేక చిత్రాల్లో ఉపయోగించిన పదాలను కూడా ఇందులో వాడటానికి వీల్లేదని షరతు విధించారు. మరో మార్గం లేక మ్యూట్ చేశాం. సినిమాను ఉజ్బెకిస్థాన్ షూట్ చేశాం. యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమాను రూపొందించామని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ ఎం.సుబారక్, కెమెరా కేఏ శక్తివేల్, సంగీతం సి.సత్య. (Director M Saravanan)