సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mohanbabu: విశాల్‌కు పొగరు ఎక్కువ!

ABN, First Publish Date - 2022-12-20T09:23:02+05:30

‘పందెం కోడి’ చిత్రంలో విశాల్‌ నటనంటే నాకెంతో ఇష్టం. ఆయన కథల ఎంపిక బావుంటుంది. ‘ప్రేమ చదరంగం’, ‘పొగరు’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింప తెచ్చుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పందెం కోడి’ (Pandem kodi)చిత్రంలో విశాల్‌ (Vishal)నటనంటే నాకెంతో ఇష్టం. ఆయన కథల ఎంపిక బావుంటుంది. ‘ప్రేమ చదరంగం’, ‘పొగరు’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింప తెచ్చుకున్నాడు. విశాల్‌కు నిజంగానే కొంచెం పొగరు అనే విషయం నాకు తెలుసు. మనిషికి పొగరుండాలి. కానీ, అది ఎదుటివారికి హాని చేేసలా ఉండకూడదు’’ అని మోహన్‌బాబు అన్నారు. విశాల్‌ హీరోగా ఎ.వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ‘లాఠీ’ Laththi,) చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తిరుపతిలో ఎస్వీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ఎస్‌.డి.హెచ్‌.ఆర్‌ కళాశాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు (Mohanbabu)ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘ దాదాపు ఎనిమివేళ్లగా కుటుంబానికి సంబంధించిన వేడుకలకు తప్ప ఇతరుల ఫంక్షన్‌లకు వెళ్లడం లేదు. విశాల్‌ అడగ్గానే ‘లాఠీ’ ఫంక్షన్‌కు వచ్యాను. వారి కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్‌ అతన్ని మనం గౌరవించాలి ప్రేమించాలి. విశాల్‌ తండ్రి నాతో యం.ధర్మరాజు ఎం.ఎ చిత్రం తీశారు. ‘లాఠీ’ ఒక కానిేస్టబుల్‌ కథ. టైౖలర్‌ చాలా బావుంది. పందెం కోడి తరహాలో ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని మోహన్‌బాబు అన్నారు.

కాలేజ్‌లో లవ్‌ ఫెయిల్‌.. అప్పటి నుంచే అలవాటు!

విశాల్‌ మాట్లాడుతూ ‘‘లాఠీ’ సినిమాలో నాలుగో అంతస్తు నుంచి దూకే సీన్‌ ఒకటుంది. దాన్ని రియలిస్టిక్‌గా చేయాలని అక్కడ్నుంచీ దూకాను. గాయాలైతే కేరళలో చికిత్స తీసుకున్నా. అభిమానులను ఇలా చూస్తుంటే ఎనిమిదో అంతస్తు నుంచి దూకేవాడిని. 18సంవత్సరాల నుంచి నటుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నానంట అభిమానుల అండదండలే కారణం. ఈ సినిమా కానిస్టేబుల్స్‌ అందరికీ అంకితమిస్తున్నా. కాలేజ్‌లో లవ్‌ ఫెయిల్‌ అయింది. అప్పటి నుంచి నాకు పరాజయాలు అలవాటే. అవే మనకు ఎన్నో నేర్పిస్తాయి.

పవన్‌తో సినిమా చేస్తా...

ప్రస్తుతం నటిస్తోన్న ‘మార్క్‌ ఆంటోనీ’ 2023 ఏప్రిల్‌ 14న విడుదలవుతుంది. స్వీయ దర్శకత్వంలో నేను నటిస్తున్న ‘డిటెక్టివ్‌ 2’ ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. సినీరంగంలో ఉన్న వారికి ఫిట్‌నెస్‌ చాలా అవసరం. నేను అన్నం, చపాతీ తినను. రెగ్యులర్‌ డైట్‌ ఫాలో అవుతా. ఎక్కువగా సైకిల్‌ మీద ప్రయాణిస్తా. మల్టీస్టారర్‌ అవకాశం వస్తే తెలుగులో పవన్‌కల్యాణ్‌, కన్నడలో యశ్‌, హిందీలో అక్షయ్‌కుమార్‌తో చేస్తా. నేను పవన్‌కల్యాణ్‌ అభిమానిని’ అని అన్నారు.

Updated Date - 2022-12-20T09:23:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!