Trisha: రాజకీయాలతో నాకు సంబంధం లేదు
ABN, First Publish Date - 2022-12-26T10:58:31+05:30
చిత్రపరిశ్రమకు వచ్చి 20 యేళ్ళ గడిచిపోయాయని, ఈ రెండు దశాబ్దాల్లో వాస్తవిక అంశాలను మాత్రమే పరిగణనలోకి..
తాను కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరబోతున్నట్టు జరిగిన ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని, అస్సలు తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ త్రిష స్పష్టం చేసింది. ఆమె నటించిన కొత్త చిత్రం ‘రాంగీ’ (Raangi) ఈ నెల 30న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన వార్తలపై త్రిష (Trisha) క్లారిటీ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. తాను చిత్రపరిశ్రమకు వచ్చి 20 యేళ్ళ గడిచిపోయాయని, ఈ రెండు దశాబ్దాల్లో వాస్తవిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నానని, విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఒక ప్రచారం చేశారని, అందులో ఏమాత్రం నిజం లేదని, తనకు రాజకీయాలకు (Politics) రవ్వంత కూడా సంబంధం లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో పెళ్ళి ఎపుడు? మీకు ఇష్టమైన నటుడు ఎవరు? వంటి ప్రశ్నలను తనని కొంతకాలం పాటు అడగకుండా ఉండటం మంచిదని సూచించింది.