సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

2022 కోలీవుడ్ ముఖచిత్రమిదే..

ABN, First Publish Date - 2022-12-28T13:32:52+05:30

2020, 2021 సంవత్సరాల్లో తమిళ చిత్రపరిశ్రమ (Kollywood) కోలుకోలేని విధంగా నష్టపోయింది. పెద్ద హీరోలకు చెందిన ఒకట్రెండు చిత్రాలు మినహా, చిన్న చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. కానీ, 2022లో పరిస్థితి చాలా మేరకు..

Kollywood 2022
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందేళ్ళ తమిళ సినిమా చరిత్ర (Kollywood History)లో కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సంవత్సరం 2022. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రతి రంగం కుదేలైపోయింది. వాటిలో చిత్రపరిశ్రమ కూడా ఉంది. 2020, 2021 సంవత్సరాల్లో తమిళ చిత్రపరిశ్రమ (Kollywood) కోలుకోలేని విధంగా నష్టపోయింది. పెద్ద హీరోలకు చెందిన ఒకట్రెండు చిత్రాలు మినహా, చిన్న చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. కానీ, 2022లో పరిస్థితి చాలా మేరకు మెరుగుపడిందని చెప్పాలి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan), ‘విక్రమ్‌’ (Vikram), ‘బీస్ట్‌’ (Beast), ‘డాన్‌’ (Don), ‘ఎఫ్‌ఐఆర్‌’ (FIR), ‘తిరుచిట్రాంబలం’, ‘వెందు తణిందదు కాడు’, ‘సర్దార్‌’, ‘లవ్‌టుడే’ చిత్రాలు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అలాగే, ఈ యేడాదిలో కోలీవుడ్ ముఖచిత్రాన్ని ఒక్కసారి గమనిస్తే..

* దర్శకుడు సెల్వరాఘవన్‌ ‘బీస్ట్‌’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు.

* కోలీవుడ్‌ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఇసైఙ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja), ఆయన తనయుడు యువన్‌ శంకర్‌ రాజా కలిసి ‘మామనిదన్‌’ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

* ఈ యేడాది డిసెంబరు 23వ వరకు 180కి పైగా చిత్రాలు థియేటర్‌లో విడుదలకాగా, 25 చిత్రాలు ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌ చేశారు.

* ఈ యేడాది వెండితెరకు ఇద్దరు హీరోలు పరిచయం కాగా, వారిలో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) ఒక్కరే హీరోగా నిలదొక్కుకోగలిగారు.

* సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన చిత్రం ఒక్కటి కూడా విడుదలకాలేదు. దీనికి బదులుగా ‘బాబా’ (BaBa) రీ రిలీజ్‌ చేశారు.

* హీరోయిన్‌ నయనతార - విఘ్నేష్‌ శివన్‌ (Nayanthara And Vignesh Shivan) పెళ్ళిపీటలెక్కారు. అలాగే, అద్దెగర్భం ద్వారా కవల పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు.

* ‘మామన్నన్‌’ చిత్రమే తన సినిమా కెరీర్‌కు చివరి చిత్రమని హీరో ఉదయనిధి (Udhayanidhi) ప్రకటించారు.

* ‘ఇసైఙ్ఞాని’ ఇళయరాజా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు.

* ఈ యేడాది ఆఖరు శుక్రవారమైన డిసెంబరు 30న ఏకంగా పదికిపైగా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

* ‘కుక్‌ విత్‌ కోమాలి’ ఫేం అశ్విన్‌ ‘ఎన్న సొల్ల పోగిరాయ్‌’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు.

* హాస్య నటుడు వడివేలు (Vadivelu) రీ ఎంట్రీ కోసం రిజిస్టర్‌ చేయించుకున్న ‘నాయి శేఖర్‌’ టైటిల్‌ వివాదంలో చిక్కుకుంది. దీంతో వడివేలు తన చిత్రానికి ‘నాయ్‌ శేఖర్‌ రిటర్న్స్‌’గా పేరు మార్చుకున్నారు.

* ఈ యేడాది అగ్రహీరోలు నటించిన చిత్రం ఫిబ్రవరిలోనే విడుదలైంది. అది కూడా విశాల్‌ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్‌ అయింది.

* ఈ యేడాది విష్ణు విశాల్‌ నటించిన ‘ఎఫ్‌ఐఆర్‌’ (FIR) తొలి సక్సెస్‌ చిత్రంగా నమోదైంది.

* మణికంఠన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)గా నటించిన ‘కడైసి వివసాయి’ ఫిబ్రవరి 11న రిలీజ్‌ కాగా, నల్లాండి అనే వృద్ధుడిగా ప్రధాన పాత్ర పోషించారు.

* హీరో అజిత్‌ (Ajith) నటించిన ‘వలిమై’ (Valimai) ఫిబ్రవరి 24న విడుదలైంది. యువన్‌ శంకర్‌ రాజా పాటలకు సంగీత స్వరాలు సమకూర్చగా, జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందించారు.

* కొరియోగ్రాఫర్‌ బృంద దర్శకురాలిగా పరిచమయైున ‘హే సినామికా’ మార్చి 30న విడుదలైంది.

* పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య (Suriya) నటించిన ‘ఎదర్కుం తుణిందన్‌’ చిత్రం మార్చి 10న విడుదలై నిరాశపరిచింది.

* వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌ నటించిన ‘మన్మథ లీలై’ ఏప్రిల్‌ ఒకటో తేదీన విడుదలైంది.

* నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ - విజయ్‌ (Vijay) - పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన ‘బీస్ట్‌’ తమిళ ఉగాదిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 13న విడుదలైంది. ఇందులోని ‘అరబిక్‌ కుత్తు’ (Arabic Kuthu) అనే పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయింది.

* విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార, సమంత (Samantha), విజయ్‌ సేతుపతి నటించిన ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న వచ్చింది.

* డెబ్యూ డైరెక్టర్‌ సిబి చక్రవర్తి దర్శకత్వంలో అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతంలో శివకార్తికేయన్‌ (SivaKarthikeyan) - ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటించిన ‘డాన్‌’ మే 13న విడుదలైంది.

* 2019లో హిందీలో వచ్చిన ‘ఆర్టికల్‌ 15’ను తమిళంలోకి ఉదయనిధి హీరోగా ‘నెంజుక్కు నీది’ పేరుతో రీమేక్‌ చేయగా, మే 20న విడుదల చేశారు.

* యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), సూర్య నటించిన ‘విక్రమ్‌’ చిత్రం జూన్‌ 3న విడుదలైంది. ఈ మూవీ రూ.400 కోట్ల మేరకు వసూళ్ళు రాబట్టి కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

* కోలీవుడ్‌లో చాక్లెట్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన హీరో ఆర్‌.మాధవన్‌ (R Madhavan) ప్రఖ్యాత రాకెట్‌ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించారు. ‘రాకెట్రీ’ (Rocketry) పేరుతో వచ్చిన ఈ మూవీ జూలై ఒకటో తేదీ పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేశారు.

* టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ (Ram) ‘ది వారియర్‌’ (The Warriorr) మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఎన్‌.లింగుస్వామి (N Lingusamy) దర్శకత్వం వహించారు

* సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా డైరెక్టర్‌ గౌతం రామచంద్రన్‌ తెరకెక్కించిన ‘గార్గి’ చిత్రం జూలై 15న రిలీజ్‌ కాగా, సినీ విమర్శకులను సైతం మెప్పించింది.

* పార్తిబన్‌ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘ఇరవిన్‌ నిళల్‌’. జూలై 15న విడుదలకాగా, ఇది భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తయారైన తొలి నాన్‌ లీనియర్‌ సింగిల్‌ షాట్‌ మూవీగా రికార్డుపుటలకెక్కింది.

* ప్రముఖ వస్త్ర దుకాణ ప్రచారం ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ వస్త్రవ్యాపారి లెజెండ్‌ శరవణన్‌ ‘ది లెజెండ్‌’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీ జూలై 28న విడుదలైంది.

* చియాన్ విక్రమ్ (Vikram), శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న ‘కోబ్రా’ (Cobra) చిత్రం ఆగస్ట్ 31న విడుదలై తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమాతో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా పరిచయమయ్యారు.

* ప్రముఖ రచయిత ‘కల్కి’ రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దృశ్యరూపంగా మార్చారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), విక్రమ్‌, త్రిష (Trisha), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai), ఐశ్వర్య లక్ష్మి నటించారు. ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది.

* ‘కోమాలి’ ఫేం ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘లవ్‌టుడే’ (Love Today) చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. నవంబరు 11వ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Updated Date - 2022-12-28T14:27:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!