సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లేటు వయసులో రెండో ఇన్నింగ్స్‌..

ABN, First Publish Date - 2022-03-24T19:14:24+05:30

‘ఉన్నైతేడి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక ఆ తర్వాత పలుచిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో సింగిల్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేసింది. కానీ, సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉన్నైతేడి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక ఆ తర్వాత పలుచిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో సింగిల్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేసింది. కానీ, సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో సురేష్‌ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకుని ముంబైలో స్థిరపడిపోయింది. ఇపుడు మళ్ళీ సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన 42 ఏళ్ళ మాళవిక.. లేటు వయసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. పొన్‌ కుమరన్‌ దర్శకత్వంలో మిర్చి శివ - జీవా నటిస్తున్న మల్టీస్టారర్‌ హాస్యభరిత చిత్రం ‘గోల్‌మాల్‌’లో ఓ కీలక పాత్రను మాళవిక పోషిస్తోంది. అయితే, మాళవిక ఈ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకోనుంది. హీరోయిన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, గ్లామర్‌ లేడీ విలన్‌ ఇలా పలు కోణాల్లో వెండితెరపై కనిపించే మాళవిక అందుకు తగిన విధంగా తన శరీరాకృతిని మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. 

Updated Date - 2022-03-24T19:14:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!