సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhavana: నన్ను టార్గెట్ చేస్తున్న వారెవరో తెలుసు

ABN, First Publish Date - 2022-12-20T21:45:06+05:30

దక్షిణాది హీరోయిన్లలో ఒకరైన భావన (Bhavana) తన వ్యక్తిగత, కుటుంబ తగాదాల కారణంగా చిత్ర పరిశ్రమకు

Bhavana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది హీరోయిన్లలో ఒకరైన భావన (Bhavana) తన వ్యక్తిగత, కుటుంబ తగాదాల కారణంగా చిత్ర పరిశ్రమకు దూరమైంది. కానీ, స్నేహితుల ఒత్తిడి, ప్రోద్బలంతో మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాలను ఆమె తాజాగా వెల్లడించింది.

‘‘మళ్ళీ సినిమాల్లో నటించకూడదన్న కఠిన నిర్ణయంతో ఈ పరిశ్రమకు దూరమయ్యాను. కానీ, సినిమానే నాకు అన్నీ ఇచ్చింది. ఈ సినిమానే అన్ని దూరం చేసింది. మళ్ళీ సినిమాల్లోకి వస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భావించాను. దీనికితోడు సన్నిహితులు, స్నేహితులు కూడా నన్ను ప్రోత్సహించారు. నాకు వ్యతిరేకంగా ఒక సైబర్‌ ముఠా పనిచేస్తోంది. నా వెంట ఉంటూనే నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. అలాంటి వారు ఎవరో నాకు బాగా తెలుసు. వారిని ఓ కంట కనిపెట్టే ఉంటాను. పైగా ఒకరిని టార్గెట్‌ చేస్తూ, వారికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేయడం ఇపుడు ఓ ఫ్యాషనైపోయింది. ఇందుకోసం నెలవారీ వేతనాలు ఇచ్చి కొందరు పనిమనుషులను కూడా నియమిస్తున్నారు’’ అంటూ నటి భావన చెప్పుకొచ్చింది. (Heroine Bhavana)

Updated Date - 2022-12-20T21:45:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!