ఆస్కార్ అవార్స్ 2022.. ఈ ఏడాది ప్రత్యక్ష ప్రసారం లేనట్టే.. కారణం ఏంటంటే..
ABN, First Publish Date - 2022-02-23T17:19:14+05:30
ప్రపంచంలో ఎన్నో సినీ అవార్డులు ఉన్నప్పటికీ ఆస్కార్ అవార్డులకి ఉన్న ప్రత్యేకతే వేరు.
ప్రపంచంలో ఎన్నో సినీ అవార్డులు ఉన్నప్పటికీ ఆస్కార్ అవార్డులకి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మార్చిలో 94వ సారి ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అయితే ఈ షోని ఎప్పటిలాగా ప్రత్యక్ష ప్రసారం లేదు. ఈ విషయాన్ని అకాడమీ అవార్డుల అధ్యక్షుడు డేవిడ్ రుబిన్ ప్రకటించారు.
ఈ అవార్డుల గురించి డేవిడ్ విడుదల చేసిన ఓ ప్రకటనలో సినిమా రంగంలోని ప్రముఖులు, నెట్‌వర్క్ పార్ట్‌నర్, ఇతరుల సలహాలు, సూచనల మేరకు ఈ ఏడాది ప్రత్యక్ష ప్రసారం లేదని చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని చూసేలా చేసేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ప్రతి ఏడు కూడా ఈ షో ప్రత్యక్ష ప్రసారం అయ్యేకంటే ముందే 8 అవార్డులను ప్రదానోత్సవం జరుగుతుంది. మా ఆలోచన ప్రకారం అన్ని టీవీలో ప్రసారం కావాలి. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపారు.
అయితే, అందరికీ ఆస్కార్ అవార్డులుగా తెలిసిన ఈ అకాడమీ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రదానం చేస్తుంది. 1929లో ప్రారంభమైన ఈ ఉత్సవంలో ప్రస్తుతం 23 కేటగిరిల్లో అవార్డ్స్‌ని ఇస్తోంది.