సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

21 ఏళ్లకే సెక్స్‌ వర్కర్ల జీవితంపై సినిమా తీసిన Directorపై ప్రశంసల వర్షం

ABN, First Publish Date - 2022-05-27T02:08:08+05:30

తన 21 యేటలోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సెక్స్‌ వర్కర్ల జీవితాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఒక చిత్రాన్ని నిర్మించడమంటే మాటలు కాదని, ఎంతో దమ్ము కావాలని, అందుకే దర్శకుడు 21 ఏళ్ల సంజయ్‌ నారాయణన్‌ (Sanjay Narayanan) ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన 21 యేటలోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సెక్స్‌ వర్కర్ల జీవితాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఒక చిత్రాన్ని నిర్మించడమంటే మాటలు కాదని, ఎంతో దమ్ము కావాలని, అందుకే దర్శకుడు 21 ఏళ్ల సంజయ్‌ నారాయణన్‌ (Sanjay Narayanan) ధైర్యానికి సెల్యూట్‌ చేస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌ (K. S. Ravikumar) కొనియాడారు. టీనేజర్‌ సంజయ్‌ నారాయణన్‌ రూపొందించిన ‘మాలై నేర మల్లిపూ’ (Maalai Nera Mallipoo) ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు కె.ఎస్. రవికుమార్‌, వసంత్‌ (Vasanth), సుబ్రహ్మణ్య శివ (Subrahmanya Siva), సెల్వకన్నన్‌ (Selva Kannan) సహా.. చిత్ర బృందం హాజరైంది. 


ఆడియో రిలీజ్‌ చేసిన అనంతరం కె.ఎస్. రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు బాలచందర్‌ (Balachander) ‘అరంగేట్రం’ చిత్రానికి ముందు అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ, ఈ యువ దర్శకుడు తన తొలి చిత్రంతోనే సెక్స్‌ వర్కర్‌ జీవితాన్ని తన కథాంశంగా ఎన్నుకోవడమంటే ఎంతో ధైర్యం కావాలి. కుమారుడి కలను నిజం చేసేందుకు దర్శకుడు తల్లి ఎంతో సహాయం చేశారు. నాలో మదర్‌ సెంటిమెంట్‌ ఎక్కువ అందుకే ఇక్కడకు వచ్చాను. చిత్ర బృందానికి అభినందనలు’’ అని పేర్కొన్నారు. 


దర్శకుడు వసంత్‌ మాట్లాడుతూ ‘‘21 ఏళ్ళ యువకుడు ఎంచుకున్న సబ్జెక్టును ఎవరూ ఊహించి వుండరు. ట్రైలర్‌ చూస్తుంటే మొదటి చిత్రంగా లేదు. భవిష్యత్‌లో ఉన్నతస్థానానికి ఎదుగుతాడు’’ అని ప్రశంసించగా.. దర్శకుడు సుబ్రహ్మణ్య శివ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చిత్రాలు చిన్న వయస్సులోనే తీయాలి. ఆ పని సంజయ్‌ విజయవంతంగా పూర్తిచేశారు’’ అని అన్నారు. 


చిత్ర దర్శకుడు సంజయ్‌ నారాయణన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా చిన్న చిత్రం. కాలేజీ ఫ్రెండ్స్‌ కలిసి నిర్మించాం. ప్రతి ఒక్కరి మద్దతు కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రధాన పాత్ర పోషించిన వినిత్రా మేనన్‌ (Vinithra Menon) మాట్లాడుతూ.. ‘‘ఈ కథలోని పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను. ఎంతో ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర. కొన్ని సీన్లు షూట్‌ చేసే సమయంలో ఎంతో భావోద్వేగంతో పాటు బాధ అనుభవించాం. ప్రతి ఒక్కరూ సపోర్ట్‌ చేయాలి’’ అని కోరారు. ఈ చిత్రాన్ని యన్‌ ఎవిరీ ఫ్రేమ్‌ మ్యాటర్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై విజయలక్ష్మి నారాయణన్‌ (Vijayalakshmi Narayanan) నిర్మించారు.



Updated Date - 2022-05-27T02:08:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!