సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాన్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభించిన విశాల్.. హీరోయిన్ ఎవరంటే..?

ABN, First Publish Date - 2022-05-06T02:34:47+05:30

విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విశాల్. ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘డిటెక్టివ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విశాల్. ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘డిటెక్టివ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు విశాల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాగా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కదని కోలీవుడ్ వర్గాలు భావించాయి. అందరు ఇలా మాట్లాడుకుంటుండగానే మే 5న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.


ఈ సినిమాకు ‘మార్క్ ఆంథోనీ’ (Mark Antony) అని టైటిల్ పెట్టారు. ఎస్‌జె. సూర్య(SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. పలు భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటిస్తుంది. మిని స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఐదు భాషల్లో విడుదల కాబోతుందని సమాచారం. 1970ల నేపథ్యంగా చిత్రం కొనసాగబోతున్నట్టు సమాచారం. అందువల్ల ఆ కాలాన్ని ప్రతిబింబించేలా గ్రాండ్‌గా సెట్‌‌లను వేయబోతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉమేష్ వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికీ జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నటీ, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.





Updated Date - 2022-05-06T02:34:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!