సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ వాలిమై’కి ఆ దర్శకుడు రెమ్యునరేషన్ తీసుకోలేదట.. !

ABN, First Publish Date - 2022-01-03T02:23:38+05:30

కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికి వినయ, విధేయతలతో పేరు తెచ్చుకున్న నటుడు అజిత్. తన పేరు ముందు ‘ తలా ’ అనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికి వినయ, విధేయతలతో పేరు తెచ్చుకున్న నటుడు అజిత్. తన పేరు ముందు ‘ తలా ’ అనే ట్యాగ్‌ను తీసేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేసి సింప్లిసిటిని మరోసారి నిరూపించుకున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘‘ వాలిమై ’’. హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ మధ్యనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కొన్ని నిమిషాల్లో‌నే ఆ ట్రైలర్‌ను లక్షలాది మంది చూశారు. 


ప్రమోషన్స్‌ల్లో భాగంగా ‘ వాలిమై’  దర్శకుడైన హెచ్. వినోద్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడైన  విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకు పనిచేసినప్పటికి రెమ్యునరేషన్ తీసుకొలేదని చెప్పారు. ఈ చిత్రంలో ఆయన 2 పాటలను రానినప్పటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వినోద్ వెల్లడించారు. విఘ్నేశ్ చేసిన పనికి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 


ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ ‘‘కాతు వక్కుల రెండు కాదల్ ’’  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2022-01-03T02:23:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!