సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అజిత్ ‘ వలీమై’ వాయిదా

ABN, First Publish Date - 2022-01-07T01:08:19+05:30

సంక్రాంతి పండగకి విడుదల కావాల్సిన సినిమాలన్ని ఒకదాని తర్వాత మరొకటి వాయిదా పడుతున్నాయి. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతి పండగకి విడుదల కావాల్సిన సినిమాలన్ని ఒకదాని తర్వాత మరొకటి వాయిదా పడుతున్నాయి. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. తాజాగా ఈ జాబితాలోకి మరొక చిత్రం చేరింది. ఆ సినిమానే ‘‘ వలీమై’’. అజిత్ హీరోగా నటించారు. కార్తికేయ విలన్‌ పాత్రను పోషించారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న చిత్రాన్ని విడుదల చేస్తామని  నిర్మాతలు ప్రకటించారు. కానీ, కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో చిత్ర విడుదలను వాయిదా వేశామని నిర్మాత బోనీ కపూర్ చెప్పారు. సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు. 


‘‘ ప్రేక్షకులు, అభిమానులే సినిమాలకు బలం. కోవిడ్ కాలంలోను వీరందరూ సినిమాలపై ప్రేమను చూపించారు. అనేక ఒడుదొడుకులను తట్టుకుని ఈ సినిమా చిత్రీకరణ‌ను పూర్తి చేశాం. ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లో విడుదల చేయాలని ప్రతి నిమిషం తపించాం. కానీ, పరిస్థితులు అనుకూలించడం లేవు.  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లపై నిషేధం ఉంది. అందువల్ల పరిస్థితులు కుదుటపడేవరకు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. థియేటర్లల్లో త్వరలో‌నే కలుస్తాం ’’ అని బోనీ కపూర్ తెలిపారు. ‘ వలీమై’ కు హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు.



Updated Date - 2022-01-07T01:08:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!