Itlu Maredumilli Prajaneekam: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ABN, First Publish Date - 2022-12-19T20:29:10+05:30
అల్లరి నరేష్ (Allari Naresh), ఆనంది (Anandhi) హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 25న విడుదలైంది.
అల్లరి నరేష్ (Allari Naresh), ఆనంది (Anandhi) హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 25న విడుదలైంది. విభిన్న ప్రయత్నంగా తెరకెక్కినప్పటికి ఈ చిత్రం జనాదరణ పొందలేదు. ఈ మూవీ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించి డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ డిజిటల్ రైట్స్‌ను ‘జీ-5’ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో క్రిస్‌మస్ కానుకగా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 23 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో జీ-5 సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘మారేడుమిల్లి ప్రపంచాన్ని స్కూల్ టీచర్ కళ్ల నుంచి చూడండి. అతడు రాజకీయాలతో మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు’’ అని ‘జీ-5’ ప్లాట్‌ఫామ్ పేర్కొంది. ఓ గ్లింప్స్‌ను కూడా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు, శ్రీతేజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికి ఓటీటీలో రికార్డులను సృష్టిస్తుంటాయి. కొన్ని రోజుల క్రితం జీ 5 ఓటీటీలో మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) స్ట్రీమింగ్ అయ్యి ఈ విధంగానే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ మూవీకి 75 మిలియన్స్ ప్లస్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చినట్లుగా జీ5 వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఆ లెక్కన ఈ సినిమా ఓటీటీలో మంచి విజయం సాధించినట్లుగానే చెప్పుకోవచ్చు. ఇదే బాటలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రయాణిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.