సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aha OTT: అందుకే సారీ చెప్పారా?

ABN, First Publish Date - 2022-12-26T14:39:46+05:30

వీక్షకులకు ‘ఆహా ఓటీటీ’ (Aha OTT) సడెన్‌గా ఓ ట్విస్ట్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా.. ‘‘అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మీ ఆహా.. వుయ్ ఆర్ సారీ.. మావ బ్రోస్’’ అని..

Aha Unstoppable with NBK
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీక్షకులకు ‘ఆహా ఓటీటీ’ (Aha OTT) సడెన్‌గా ఓ ట్విస్ట్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా.. ‘‘అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మీ ఆహా.. వుయ్ ఆర్ సారీ.. మావ బ్రోస్’’ అని ట్వీట్ చేయడంతో ఏమై ఉంటుందా? అని ‘ఆహా’ వీక్షకులు కంగారు పడుతున్నారు. ఎందుకు వారు సడెన్‌గా ఇలా సారీ చెప్పారనేది.. ఆహా వీక్షకులకు, నెటిజన్లకు అర్థం కావడం లేదు. మరోవైపు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ (Unstoppable with NBK) సీజన్‌ 2 మాంచి ఊపు మీదున్న సమయంలో.. సడన్‌గా ఆహా ఇలా సారీ చెప్పడంతో.. అనేకానేక అనుమానాలు వీక్షకులలో వ్యక్తమవుతున్నాయి. అందునా.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌లో ఈ అనుమానాలు కాస్త ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. అన్‌స్టాపబుల్ షో‌కి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ పూర్తయింది. డిసెంబర్ 30న టెలికాస్ట్ కాబోతోంది. మరోవైపు డిసెంబర్ 27న పవన్ కల్యాణ్ ఈ షో లో పాల్గొనే ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నారనేలా వార్తలు బయటికి వచ్చిన నేపథ్యంలో.. ఇలా సారీ అని వారు ట్వీట్ చేయడంతో.. విషయం తెలియక అంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్, ప్రభాస్‌లకు సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో వారెమైనా.. ఇలా సారీ చెప్పారా? ప్రభాస్ ఎపిసోడ్ చెప్పిన టైమ్‌కి టెలికాస్ట్ చేయడం లేదా? లేదంటే పవన్ కల్యాణ్ ఈ షో కి రావడం లేదా? వీటిలో ఏమై ఉంటుంది. విషయం చెప్పకుండా ఇలా సారీ చెప్పడం ఏమిటి? అంటూ నెటిజన్లు ఈ ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ‘ప్రభాస్ ఎపిసోడ్ కనుక టెలికాస్ట్ కాకపోతేనా..’ అంటూ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. అయితే.. ఎందుకంటే అని.. మరో ట్వీట్ ఆహా ఓటీటీ నుంచి వచ్చింది. ‘మీ అబ్బాయిని నా కొ** అని పిలిచేలా చేసినందుకు’ అంటూ ఏదో తలాతోక లేని సమాధానంతో కవర్ చేసేందుకు ఆహా ప్రయత్నించినట్లుగా ఈ ట్వీట్‌తో తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్య ‘అన్‌స్టాపబుల్’ షోని, దానికి వస్తున్న రెస్పాన్స్‌ని చూసుకుని.. సబ్‌స్క్రిప్షన్ ఛార్జెస్‌ను ‘ఆహా’ అమాంతం పెంచేసింది. ఆల్రెడీ సంవత్సరం ప్యాకేజ్ తీసుకున్నవారికి కూడా.. నూతన సినిమాలు, షోలు ఓపెన్ కావడం లేదు. మీరు అప్‌గ్రేడ్ కావాలంటూ మెసేజ్ చూపిస్తుంది. దీంతో ఆహా వీక్షకులు విసిగిపోవడమే కాకుండా.. వేరే ఆప్షన్‌కు వెళ్లిపోతున్నారు. తెలుగు-తమిళ షో లు, సినిమాలు చూసేందుకు దాదాపు రూ. 700 సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలంటూ ఆహా ఇచ్చిన సడెన్ ట్విస్ట్‌తో.. చాలా మంది యూజర్స్ ఆహాకు దూరమవుతున్నారు. మరి దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ వారు సారీ చెప్పారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-12-26T14:54:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!