Rare Pic: ‘కొదమసింహం’తో హీరోలు, నిర్మాతలు
ABN, First Publish Date - 2022-06-21T01:13:14+05:30
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ఏకైక కౌ బాయ్ చిత్రం ‘కొదమసింహం’ (Kodama Simham). నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఐదు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకోవడం విశేషం. కైకాల సత్యనారాయణ..
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ఏకైక కౌ బాయ్ చిత్రం ‘కొదమసింహం’ (Kodama Simham). నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఐదు రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకోవడం విశేషం. కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) సమర్పణలో ఆయన తమ్ముడు నాగేశ్వరరావు (Nageswara Rao) నిర్మించిన ఈ చిత్రానికి మురళీ మోహనరావు (Murali Mohan Rao) దర్శకుడు. రాధ, వాణి విశ్వనాధ్, సోనమ్ హీరోయిన్లు. ఈ సినిమాతో చిరు సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. డ్యాన్సులలో కూడా చిరు తనదైన మార్కును ప్రదర్శించారు.
‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) విడుదలైన సరిగ్గా మూడు నెలలకు ‘కొదమసింహం’ చిత్రం విడుదలైంది. వాహిని స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేశారు. షూటింగ్ స్పాట్‌కు ఒకే రోజు హీరోలు రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్.. నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, డాక్టర్ వెంకటేశ్వరరావు.. దర్శకులు రవిరాజా పినిశెట్టి, శరత్ వచ్చి సందడి చేశారు. ఆ అరుదైన దృశ్యం ఇదే.
-వినాయకరావు