Oppenheimer Trailer: ఒళ్లు గగుర్పొడిచే విజువల్స్‌తో.. అణుబాంబు తయారీ
ABN, First Publish Date - 2022-12-19T21:02:16+05:30
హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) ఒకరు. ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువే కానీ.. ఆయా సినిమాల ఇంపాక్ట్ మాత్రం ప్రపంచం మొత్తాన్ని..
హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) ఒకరు. ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువే కానీ.. ఆయా సినిమాల ఇంపాక్ట్ మాత్రం ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంటుంది. ఇప్పుడలాంటి నేపథ్యంలోనే ఆయన ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) అనే సినిమా చేస్తున్నారు. ఇది అలాంటిలాంటి సినిమా కాదు.. అణుబాంబ్ (Atom Bomb) లాంటి సినిమా. అణుబాంబ్ లాంటిది కూడా కాదు.. అణుబాంబ్‌పైనే ఈ సినిమా ఉండబోతుందనేది తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. అణుబాంబ్ పితామహుడుగా పేరున్న అమెరికా భౌతిక శాస్త్రవేత్త ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్’ (J. Robert Oppenheimer) జీవిత కథ ఆధారంగా నోలన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ‘అణుబాంబు’ తయారీకి సంబంధించి ప్రతి విషయాన్ని ఆయన కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ‘అవతార్’ రెండో భాగంతో ప్రేక్షకులు ఓ అద్భుత ప్రపంచంలో విహరిస్తున్నారు. ఇందులోని విజువల్స్.. ముఖ్యంగా వాటర్‌లో వచ్చే సన్నివేశాలను చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. అలా ఆశ్చర్యపోతున్న వారందరినీ ఇంకొన్ని రోజుల్లో థ్రిల్ చేయడానికి క్రిస్టోఫర్ నోలన్ సిద్ధమవుతున్నారు. 1942-1946లో అణ్వాయుధాల సృష్టికి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్ట్ ‘మాన్‌హట్టన్’ (Manhattan Project)కు సహకరించిన వారిలో రాబర్ట్ ఓపెన్‌హైమర్ ఒకరు. అణుబాంబు తయారీకి వారు ఎంతగా శ్రమించారు? అసలు అణుబాంబు ఎలా తయారైంది? ఎలా ప్రయోగించారు? వంటి ఒళ్లు గగుర్పొడిచే విజువల్స్‌తో నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చెప్పేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఓపెన్‌హైమర్ ఎటువంటి కీలకపాత్ర పోషించాడనేది ఈ సినిమాలో నోలన్ చెప్పబోతున్నారు. ఇక ట్రైలర్‌తోనే సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిన ఆయన.. సినిమాతో ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం జూలై 21 వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమాని 21 జూలై, 2023లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కిల్లియన్ మర్ఫీ (Cillian Murphy) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాని.. నోలన్ కేవలం నాలుగు నెలలోనే షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా.. సీజీఐ ఎఫెక్ట్ లేకుండా బాంబు తయారీ, పేలుడు సీన్లను చిత్రీకరించడమనేది విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ అంతా బిజీగా ఉంది. కాగా, ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Oppenheimer Trailer)