Avatar: The Way Of Water: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ!
ABN, First Publish Date - 2022-12-17T15:45:01+05:30
‘టైటానిక్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్2’ (Avatar2). ఈ సినిమా ‘అవతార్: ది ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘టైటానిక్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్2’ (Avatar2). ఈ సినిమా ‘అవతార్: ది ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచే భారీ క్రేజ్ ఉంది. అంచనాలకు తగ్గినట్టుగానే ‘అవతార్’ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
‘అవతార్2’ తొలిరోజు రూ.41కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన రెండో హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్రాల్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ.12కోట్ల కలెక్షన్స్ ఈ సినిమాకు లభించాయి. భారత్‌లో ఇప్పటి వరకు ఒపెనింగ్ డే రికార్డు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ పేరిట ఉంది. ఈ చిత్రం 2019లో రూ.53.1కోట్ల వసూళ్లను సాధించింది. ‘అవెంజర్స్’ రికార్డును మాత్రం ‘అవతార్ 2’ అధిగమించలేకపోయింది. వసూళ్లు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ‘అవతార్2’ కు వచ్చే కలెక్షన్స్‌లో 70శాతం రెవెన్యూ షేర్ ఇవ్వాలని సినిమా డిస్ట్రిబ్యూటర్ డిస్నీ కోరింది. కానీ, అంత శాతం షేర్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ అంగీకరించలేదు. తమకు గిట్టుబాటు కాదని చెప్పారు. అందువల్లనే తమిళనాడు, కేరళలలో సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇక ‘అవతార్2’ విషయానికి వస్తే..2009లో విడుదలైన ‘అవతార్’ (Avatar)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. 160భాషల్లో విడుదల అయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మూవీని దాదాపుగా రూ.16వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ‘అవతార్2’ సక్సెస్‌పై ఆధారపడే ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ ఉంటాయని జేమ్స్ కామెరూన్ తెలిపాడు. ఒకవేళ ఈ చిత్రం ప్లాఫ్ అయితే ‘అవతార్3’ తోనే కథ పూర్తవుతుందని గతంలోనే పేర్కొన్నాడు.