ఒక్క హిట్ పడితే నిర్మాతలకు దడ పుట్టిస్తున్నారు..!
ABN, First Publish Date - 2022-02-20T13:58:13+05:30
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశం అందుకోవాలంటే అంత ఈజీ కాదు. మోడల్‌గా ఎన్నో ర్యాంప్ షోస్ చేసిన వారిలో కొందరి మీద మేకర్స్ దృష్ఠి పడి హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న వారు కొందరైతే..సినిమా హీరోయిన్ అవ్వాలనే
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశం అందుకోవాలంటే అంత ఈజీ కాదు. మోడల్‌గా ఎన్నో ర్యాంప్ షోస్ చేసిన వారిలో కొందరి మీద మేకర్స్ దృష్ఠి పడి హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న వారు కొందరైతే..సినిమా హీరోయిన్ అవ్వాలనే తాపత్రయంతో మేకర్స్ నిర్వహించే ఆడిషన్స్‌కు వచ్చి అందచందాలతో ఆకట్టుకుని అవకాశం అందుకునే వారు మరికొందరు. అయితే, గతకొంతకాలంగా అందరి మీటర్లు మారిపోతున్నాయి. హిట్ పడేంతవరకే నిర్మాతలు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క హిట్ పడితే, కండీషన్స్ అప్లై అంటూ..చాటడంత చిట్టా బయటపెడుతున్నారు. మొదటి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్‌కు అసలు సంబంధించం లేకుండా నాలుగింతలు డిమాండ్ చేస్తూ మేకర్స్ నోరెళ్ళబెట్టేలా షాకిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన వారైతే మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లిసందD' చిత్రంతో హీరోయిన్‌గా శ్రీలీల పరిచయమైంది. అందం అభినయంతో బాగానే ఆకట్టుకుంది. సినిమా ఫలితంతో సంబంధ లేకుండా ఈ యంగ్ బ్యూటీ అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఆమె రెండవ సినిమానే మాస్ రాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. దాంతో రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుందట. కొత్త సినిమాకు మేకర్స్ సంప్రదిస్తే కళ్ళు తిరిగే రెమ్యునరేషన్ చెబుతుందట. ఇటీవల అక్కినేని హీరో సుశాంత్ నటించిన చిత్రం 'ఇచ్చట వామనములు నిలుపరాదు' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గ్లామర్ బ్యూటీ మీనాక్షీ చౌదరి. ఇటీవలే ఆమె మాస్ రాజా రవితేజ నటించిన 'ఖిలాడీ' మూవీలో అవకాశం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన 'హిట్ : ద సెకండ్ కేస్' మూవీలో నటిస్తోంది. అలాగే, ఓ తమిళ సినిమాలోనూ అవకాశం అందుకుంది. అయితే, రవితేజ సినిమాతోనే అమ్మడు మేకర్స్‌కు దడ పుట్టిస్తుందని టాక్ వినిపిస్తోంది.
అలాగే గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టూ నీ హైటూ అంటూ ఐటెం సాంగ్‌తో ఆకట్టుకున్న డింపుల్ హయాతీ ఇటీవల విశాల్ హీరోగా వచ్చిన సామాన్యుడు సినిమాతో, రవితేజ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. అయినా ఇప్పుడు కొత్త సినిమాలకు డేట్స్ అడిగితే ముందు రెమ్యునరషన్ చెప్పండి అంటూ నైస్‌గా భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుందట. వీరే కాదు తాజాగా 'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేహా శెట్టి కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని చెప్పుకుంటున్నారు. ఇలా ఒక్క సినిమాకే రెమ్యునరేషన్ పెంచేస్తున్న హీరోయిన్స్ విషయంలో మేకర్స్ కూడా బాగా ఆలోచించి సినిమా ఛాన్స్ ఇవ్వాలో వద్దో డిసైడవుతున్నారట. అందుకే ఒకప్పుడు హీరోయిన్స్ 10 నుంచి 15 ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగితే..ఇప్పుడు ఇలా వచ్చి అలా కనుమరుగవుతున్నారు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.