సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్‌ సరసన దిశా పటానీ?

ABN, First Publish Date - 2022-04-01T18:36:58+05:30

బాలీవుడ్‌ నటి దిశా పటానీకి లక్కీఛాన్స్‌ వరించినట్టు వార్తలు వస్తున్నాయి. అగ్రహీరో విజయ్‌ తన తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్‌ భామను ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నటి దిశా పటానీకి లక్కీఛాన్స్‌ వరించినట్టు వార్తలు వస్తున్నాయి. అగ్రహీరో విజయ్‌ తన తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్‌ భామను ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్‌ ‘బీస్ట్‌’ చిత్రంలో నటించారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఇదే నెల 13న విడుదలకానుంది. ఆ తర్వాత తన 66వ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి S.S.తమన్‌ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందాన్న, కీర్తి సురేష్‌, తమన్నా వంటి మరికొందరు నటీమణుల పేర్లను పరిశీలించారు. అయితే, తాజాగా బాలీవుడ్‌ నటి దిశా పటానీ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Updated Date - 2022-04-01T18:36:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!