అసుర గణ రుద్ర ఎవరు?
ABN, First Publish Date - 2022-04-04T04:57:28+05:30
కమ్జుల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘అసుర గణ రుద్ర’. నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రధారులు. మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కమ్జుల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘అసుర గణ రుద్ర’. నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ ప్రధాన పాత్రధారులు. మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మురళీ వంశీ నిర్మాత. చిత్రీకరణను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఏప్రిల్ 6 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. దీని తర్వాత మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మెడికల్ క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్ రోల్ ప్లే చేసే పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథలో అసుర గణ రుద్ర ఎవరనేది ఉత్కంఠను పెంచుతుంది’ అని తెలిపారు. మురళీ శర్మ, ఆమని, శత్రు, దేవీ ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. సినిమాటోగ్రఫీ: అమరనాథ్ బొమ్మిరెడ్డి.