సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Waltair Veerayya: మరో లీక్ చేసిన చిరంజీవి.. ఈసారి ఏంటంటే..?

ABN, First Publish Date - 2022-12-14T20:06:29+05:30

చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar) అనే కాదు.. ఇంకో బిరుదు కూడా ఉంది. అదే లీకు వీరుడు. తనకు తెలియకుండానే.. రహస్యంగా ఉంచాల్సిన వాటిని ఆయన లీక్ చేస్తుంటాడు. ‘ఆచార్య’ (Acharya) టైటిల్, ఆ తర్వాత..

Shruti Haasan and Chiranjeevi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar) అనే కాదు.. ఇంకో బిరుదు కూడా ఉంది. అదే లీకు వీరుడు. తనకు తెలియకుండానే.. రహస్యంగా ఉంచాల్సిన వాటిని ఆయన లీక్ చేస్తుంటాడు. ‘ఆచార్య’ (Acharya) టైటిల్, ఆ తర్వాత కొన్ని ఇలానే ఆయన లీక్ చేశారు. ఇప్పుడు చేస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలోని ఓ సాంగ్‌కి సంబంధించిన బిట్‌ను ఆయన ఇన్‌స్టావేదికగా లీక్ చేశారు. అయితే ఈసారి తెలియకుండా కాదు.. తెలిసేలానే ఆయన లీక్ చేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న పాట లిరిక్.. ‘‘నువ్వు శ్రీదేవైతే.. ఆ.. అయితే, నేనే చిరంజీవవుతా..’’ అని ఆయన లీక్ చేశారు. ఈ లీక్‌కి కారణం.. అక్కడి లొకేషన్స్ ఆయనని ఎగ్జయిట్ చేయడమే అని చెబుతూ.. ఓ వీడియోని ఆయన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో..

‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను ఫ్రాన్స్‌ నుంచి మాట్లాడుతున్నాను.12 తారీఖున శ్రుతిహాసన్‌ (Shruti Haasan)తో నేను చేసిన సాంగ్‌ పూర్తయింది. ప్రత్యేకించి ఎందుకు షేర్‌ చేసుకుంటున్నానంటే.. నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. విజువల్స్‌ కానివ్వండి.. సాంగ్‌ కానివ్వండి.. మేము షూటింగ్‌ చేసిన లొకేషన్స్‌ చాలా అందంగా ఉన్నాయి. మేము చేసిన లొకేషన్ సౌత్‌ ఆఫ్ ఫ్రాన్స్‌లో ఉంది.. అది ‘లేజే’. ఇది స్విట్జర్లాండ్‌, ఇటలీ సరిహద్దులో ఆల్ఫ్స్‌ పర్వత లోయల్లో ఉంటుంది. మంచుతో కప్పబడిన తర్వాత ఆ లోయ అందాలు అంతా ఇంతా కావు. నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే -8 డిగ్రీల చలిలో.. సాంగ్స్‌ స్టెప్స్‌ వేయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. పాటను చిత్రీకరణకు చిత్ర బృందం కూడా చాలా కష్టపడింది. ఏదేమైనా మిమ్మల్ని అలరించడానికి అది నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. యూనిట్ మొత్తం ఎంతగానో కష్టపడింది. ఏమైతేనేం.. మేం పడిన కష్టానికి ఫలితం కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఉత్సాహాన్ని నేను ఆపుకోలేక మీతో పంచుకుందామని.. నేనే మంచి మంచి విజువల్స్‌ షూట్ చేసి మీతో షేర్‌ చేస్తున్నాను.. చూడండి. త్వరలో లిరికల్‌ వీడియో మీ ముందుకు రాబోతోంది. అది మీరు ఎంజాయ్ చేస్తారు. అయితే.. ఈ సాంగ్‌కు సంబంధించిన చిన్న బిట్‌‌ని మీకు లీక్‌ చేస్తున్నాను.. ఎవరికీ చెప్పకండి. ఎంజాయ్‌..’’ అంటూ పాటలోని చిన్న బిట్‌ను చిరంజీవి షేర్ చేశారు.. ‘‘నువ్వు శ్రీదేవైతే.. ఆ.. అయితే.. నేనే చిరంజీవవుతా.. రాయె రాయె రాయ్యె చేసేద్దాం లవ్వు’’ అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) పాడిన బిట్‌ను ఆయన లీక్ చేశారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్‌లో బాబీ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణను ప్రస్తుతం ఫ్రాన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్లలోగా భారీగా విడుదల కాబోతోంది. (Waltair Veerayya Song leaked)

Updated Date - 2022-12-14T20:06:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!