Waltair Veerayya: ఫ్యామిలీతో చిరు.. ప్రియురాలితో వీరయ్య!
ABN, First Publish Date - 2022-12-08T22:25:26+05:30
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli)ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli)ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బుధవారం ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 13 జనవరి, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక బ్యాలెన్స్ షూట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని కూడా మేకర్స్ తెలిపారు. ‘‘వాల్తేరు వీరయ్య షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan)తో పాటు చిత్రయూనిట్ యూరప్ వెళ్ళింది. అక్కడ వండర్‌ఫుల్ లొకేషన్స్‌లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు’’ అని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. (EuropeBeckons)
ఇదే అప్‌డేట్‌ని తెలియజేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర’ అంటూ మెగాస్టార్ రెండు పిక్స్ పోస్ట్ చేశారు. ఇందులో ఒక పిక్‌లో మెగాస్టార్ ఫ్యామిలీతో ఉంటే.. మరో పిక్‌లో ప్రియురాలితో.. అదే హీరోయిన్ శృతిహాసన్‌తో ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీతో చిరు, ప్రియురాలితో వీరయ్య విహార యాత్ర అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.