సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Waltair Veerayya VS Veera Simha Reddy: ఎందులోనూ తగ్గట్లే!

ABN, First Publish Date - 2022-12-16T21:24:31+05:30

బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి

Chiru vs Balayya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)గా పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏ విషయంలోనూ.. వారు తగ్గడం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ చూస్తుంటే.. నువ్వా, నేనా? అన్నట్లుగా ఇద్దరూ విజృంభించినట్లే అనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్‌లో కూడా ఇద్దరూ ఒకేలా వెళుతున్నారు. అందుక్కారణం రెండు సినిమాలను నిర్మించింది ఒకే సంస్థ.. మైత్రీ మూవీ మేకర్స్. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎవరికి వారే సెపరేట్‌గా ఈ సినిమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ రెండు సినిమాలకు సంబంధించిన థియేటర్ స్టాండీలను విడుదల చేసింది. వీటిలో ఇద్దరూ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

చిరంజీవి వాల్తేరు వీరయ్య స్టాండీ విషయానికి వస్తే.. చేతికి బేడీలతో.. గన్‌‌పై కాలు పెట్టి మెగాస్టార్ పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఆయన ఉన్నట్లుగా ఈ స్టిల్ చెబుతుంది. ఇక బాలయ్య ‘వీరసింహారెడ్డి’ విషయానికి వస్తే.. ఒక ఊరి పెద్ద తరహాలో బ్లాక్ షర్ట్ మరియు లేత గోధుమరంగు కలర్ లుంగీలో గంభీరంగా కారు పక్కన నడుస్తున్నారు. ఈ రెండు స్టాండీలు కూడా మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి (Mega and Nandamuri Fans) తెగ నచ్చేశాయి. అందుకే సోషల్ మీడియాలో వీటితో షేక్ చేస్తున్నారు. ఇక బాలయ్య సినిమా 2023, జనవరి 12వ తేదీన విడుదల కాబోతుండగా.. చిరు సినిమా జనవరి 13న విడుదల కానుంది. అవుట్ డోర్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఈ స్టాండీలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని థియేటర్లకు పంపుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Updated Date - 2022-12-16T21:24:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!