సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Virupaksha: ఎన్టీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మెగా హీరో

ABN, First Publish Date - 2022-12-08T03:56:06+05:30

మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌కు నా థ్యాంక్స్‌. ఆయన నాపై చూపించిన ప్రేమ మరువలేనిది. ఎవరేమనుకున్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ‘విరూపాక్ష’ (Virupaksha) అనే టైటిల్‌ని నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన రావడమే కాకుండా.. సినిమాపై కూడా భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకుడు. బాపినీడు.బి సమర్పణలో నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 


అనంతరం సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌కు నా థ్యాంక్స్‌. ఆయన నాపై చూపించిన ప్రేమ మరువలేనిది. ఎవరేమనుకున్నా.. ఆయనతో నా స్నేహాన్ని ఎప్పటికీ  కొనసాగించాలనుకుంటున్నాను. ఈ చిత్రానికి సుకుమార్‌‌గారు స్క్రీన్‌ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ఈ చిత్ర నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది. ఈ చిత్రంతో దర్శకుడు కార్తిక్‌ దండును అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ చిత్రం అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుందని తెలుపగా.. దర్శకుడు మాట్లాడుతూ.. 1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్‌డ్‌ విలేజ్‌లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా వుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఎంతో రిచ్‌గా చిత్రాన్ని రూపొందించారు. సుకుమార్‌ లాంటి గొప్ప దర్శకుడు నా చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి ధరమ్‌తేజ్‌ యాక్సిండెంట్‌ నుంచి కోలుకున్న తరువాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రంలో అందరూ కొత్త సాయిధరమ్‌ తేజ్‌ను చూస్తారు. ఈ చిత్రం అందరూ తప్పకుండా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా.. అని అన్నారు. (Virupaksha Title Glimpse)



Updated Date - 2022-12-08T03:56:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!