సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కథలో మలుపులు ఊహించలేరు

ABN, First Publish Date - 2022-01-25T05:45:51+05:30

నిర్మాత నట్టికుమార్‌ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘డి.ఎస్‌.జె’. నట్టికుమార్‌ దర్శకత్వం వహించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాత నట్టికుమార్‌ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘డి.ఎస్‌.జె’. నట్టికుమార్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈనెల 28న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. కానీ ఎక్కడా నటన నేర్చుకోలేదు. లాక్‌ డౌన్‌ సమయంలో యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు పోస్ట్‌ చేశాను. వాటికి మంచి స్పందన వచ్చింది. దాంతో నాపై నాకు నమ్మకం కుదిరింది. ఇది నా కోసం రాసిన కథ. సెట్స్‌పైకి వెళ్లే ముందు కొన్ని రోజులు వర్క్‌షాప్‌ నిర్వహించారు. అలా కెమెరా అలవాటు అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కథలో మలుపులు ఎవ్వరూ ఊహించలేరు. తొలి సినిమాతోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. సాయి పల్లవి, అనుష్క అంటే చాలా ఇష్టం. ప్రతి సినిమాలోనూ వాళ్ల నటన పరిశీలిస్తా. విజయశాంతిలా పవర్‌ ఫుల్‌ పాత్రలు చేయాలని వుంద’’న్నారు. 


Updated Date - 2022-01-25T05:45:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!