సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందుకే ఆ టైటిల్‌ పెట్టారు

ABN, First Publish Date - 2022-12-05T04:53:54+05:30

‘‘స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం కనెక్ట్‌ అవుతుంది. ప్రేక్షకుల తొలిప్రేమ జ్ఞాపకాలను ఈ చిత్రం తట్టిలేపుతుంది’’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం కనెక్ట్‌ అవుతుంది. ప్రేక్షకుల తొలిప్రేమ జ్ఞాపకాలను ఈ చిత్రం తట్టిలేపుతుంది’’ అని రచయిత లక్ష్మీ భూపాల్‌ అన్నారు. సత్యదేవ్‌, తమన్నా జంటగా నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. డిసెంబరు 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మీ భూపాల్‌ మాట్లాడుతూ... 


జీవితంలోని మూడు విభిన్న దశల్లో సాగే ప్రేమకథ ఇది. ‘గీతాంజలి’ జానర్‌ను స్పృశిస్తూనే, ఆద్యంతం వినోదం, భావోద్వేగాల మేళవింపుగా సాగుతుంది. ప్రేక్షకులు తమ జీవితాలను తరచి చూసుకునేలా ఉంటుంది. సత్యదేవ్‌ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. 


శీతాకాలంలో లవ్‌స్టోరీ ప్రేక్షకులకు పర్ఫెక్ట్‌ ఉంటుందని ఈ సినిమాకు ఆ టైటిల్‌ పెట్టారు. ప్రస్తుతం ‘మరీచిక’ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాలకు రచయితగా పనిచేస్తున్నాను. 

Updated Date - 2022-12-05T04:53:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!