Banaras: బనారస్ హీరోయిన్‌కి విజయ్ దేవరకొండ అంటే ఇష్టమట
ABN, First Publish Date - 2022-10-31T19:36:18+05:30
బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో (Sonal Montero) కథానాయికగా నటిస్తోంది.
ఇప్పుడు కన్నడ సినిమాలు ట్రేండింగ్ లో వున్నాయి. 'కాంతారా' (Kantara) కొన్ని వారాల క్రితం విడుదల అయి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇంకో కన్నడ సినిమా 'బనారస్' (Banaras) విడుదల అవుతోంది. దీనికి 'బెల్ బాటమ్' (Bell Bottom fame Jayatheertha is the director) ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించాడు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో (Sonal Montero) కథానాయికగా నటిస్తోంది.
ఆమె ఇంతవరకు కన్నడ సినిమాలు ఎనిమిది చేయండి. ఇప్పుడు ఈ 'బనారస్' సినిమా దేశం అంతా ఈ నవంబర్ 4 న విడుదల అవుతోంది. ఆమెకి కొంచెం నెర్వస్ గా వుంది అని చెప్తోంది. ఎందుకంటే మొదటి సారిగా ఆమె సినిమా ఒక్క కన్నడం లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి సోనాల్ మాట్లాడుతూ ఇది లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది.
అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ అనే అంశం కథలో చిన్న భాగం మాత్రమే అని చెప్తోంది మోంటెరో. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది, అలాగే కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది, స్క్రిప్ట్ చాల బాగుంది, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కచ్చితంగా ఇస్తుంది అని చెప్తోంది ఆమె. ఇందులో ఆమె పాత్ర పేరు ధని అని చెప్పి, ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది అంటోంది. ఈమధ్యే విడుదల అయిన 'కాంతార' విజయమా సాధించటం పట్ల మోంటెరో చాల ఆనందంగా, గర్వంగా కూడా వుంది అంటోంది. ఎందుకంటే ఆ సినిమా ఈమె వుండే ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథ అంట. కానీ ఇప్పుడు వస్తున్నా 'బనారస్' పూర్తిగా భిన్నమైన సినిమా, రెండు జోనర్స్ వేరు. అయితే 'కాంతార' ని ఇష్టపడినట్లే 'బనారస్' ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది.
రాబోయే సినిమాలు గురించి చెపుతూ సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నాను అని చెపుతూ మూడు కన్నడ సినిమాలు కూడా చేతిలో వున్నాయి అనిచెప్తోంది. తెలుగు అర్థం అవుతుందిట ఈమెకి. 'సీతారామం', 'ఆర్ఆర్ఆర్' , 'పుష్ప' సినిమాలు తెలుగులోనే చూసిందిట. మరి తెలుగులో ఏ నటుడు అంటే ఇష్టమో తెలుసా, 'విజయ దేవరకొండ అంటే ఇష్టం' అని చెప్పింది.