‘కళావతి’ పాటకు సితూ పాప సూపర్ డ్యాన్స్
ABN, First Publish Date - 2022-02-20T20:47:02+05:30
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇండియా జరిగిన అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కింది. 14 రీల్స్ ప్లస్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాలి. కరోనా కారణంగా ఆలస్యంగా థియేటర్స్ లోకి వస్తోంది. మే 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈసినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ ఇటీవలే విడుదలైంది. అనంతశ్రీరామ్ రచించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇండియా జరిగిన అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కింది. 14 రీల్స్ ప్లస్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాలి. కరోనా కారణంగా ఆలస్యంగా థియేటర్స్ లోకి వస్తోంది. మే 12న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈసినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ ఇటీవలే విడుదలైంది. అనంతశ్రీరామ్ రచించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. రికార్డ్ వ్యూస్ తెచ్చుకున్న ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు, కీర్తిసురేశ్ మెస్మరేజింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానుల్ని అలరిస్తున్నాయి.
అలాంటి ఈ పాటను మహేశ్ బాబు గారాల సీతూ పాప అవలీలగా చేసి చూపించడం విశేషం. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ చిచ్చరపిడుగు.. కళావతి అంటూ స్టైలిష్ గా చేసిన డ్యాన్స్ వీడియోకి మహేశ్ అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. సితార చిన్నప్పటి నుంచి తన డ్యాన్సింగ్ టాలెంట్ ను ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు కాస్తంత పెద్దదైన ఆ చిన్నారి .. తన టాలెంట్ అంతా చూపిస్తూ చేసిన డ్యాన్స్ కు నెటిజెన్స్ సైతం ఫిదా అవుతున్నారు. పింక్ కలర్ షర్ట్ , డెనిమ్ జీన్స్ ధరించిన సితార.. ఈ వీడియోకే హైలైట్ అయింది. సితార తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకి అప్పుడే నాలుగు లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. అలాగే ఆమెను అభినందిస్తూ ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి.‘ఈ పాట నీకోసమే నాన్న’ అంటూ సితారా ఆ పాటను తన తండ్రికి డెడికేట్ చేయడం ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే సితారకి 5లక్షల మందికి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోస్ ను షేర్ చేస్తుంటుంది సితూ పాప. ముఖ్యంగా తన ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోస్ నే ఎక్కువగా షేర్ చేస్తుంది. ఘట్టమనేని వారి లిటిల్ ప్రిన్సెస్ కు ఈ రేంజ్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంటుంది. ఈ సాంగ్ వీడియోకి తండ్రి మహేశ్ బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్ ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి.