సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Satyam Rajesh: హీరోగా ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌

ABN, First Publish Date - 2022-12-18T19:56:38+05:30

తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా.. మధు సూదన్ రెడ్డి (Madhusudhan Reddy) స్వీయ దర్శకత్వంలో

Satyam Rajesh New Film Details
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా.. మధు సూదన్ రెడ్డి (Madhusudhan Reddy) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ వంటి అంశాల కలయికతో ఉండబోతుందని చిత్రయూనిట్ తెలుపుతోంది. ‘రుద్రవీణ’ (Rudraveena) సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ చిత్రాన్ని సరికొత్త తరహాలో తెరకెక్కించబోతున్నారు.

సత్యం రాజేష్ సరసన రియా సచ్చదేవా (Ria Sachdeva) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పలువురు నోటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతుందని.. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు అతి త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

Updated Date - 2022-12-18T19:56:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!