HER: రుహాణి శర్మ ప్రధాన పాత్రలో.. సస్పెన్స్ థ్రిల్లర్
ABN, First Publish Date - 2022-12-08T22:53:18+05:30
పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఇటీవల వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ (Hit 2) చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైవిధ్య భరితమైన కథలతో..
పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఇటీవల వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ (Hit 2) చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైవిధ్య భరితమైన కథలతో, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కే చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయని ఇటువంటి చిత్రాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. అలాగే డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలపై ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ గమనించి.. ఇప్పుడదే తరహాలో ఓ సినిమా రెడీ అవుతోంది. ‘చిలసౌ’ ఫేమ్ రుహాణి శర్మ (Ruhani Sharma) ప్రధాన పాత్రలో ‘HER’ అనే పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి శ్రీధర్ స్వరగావ్ (Sreedhar Swaraghav) రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్‌గా ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మను హైలైట్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారనేది పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. రుహాణి శర్మ క్యారెక్టర్‌లో కంటతడి కనిపిస్తుండటం, ఆ వెనకాల హై వే, సిటీ పరిసరాలు సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. పోస్టర్ పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా.. రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర టీజర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (HER Chapter 1 First Look Poster Out)