సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ మరో రికార్డు!

ABN, First Publish Date - 2022-04-11T01:20:40+05:30

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన రోజు నుంచి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ చిత్రం రెండు వారాల సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ చిత్రం ‘దంగల్‌ కాగా, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’ స్థానం సాధించింది. ఇప్పుడు ఆ జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన రోజు నుంచి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ చిత్రం రెండు వారాల సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు రాబట్టిన  తొలి భారతీయ చిత్రం ‘దంగల్‌ కాగా, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’ స్థానం సాధించింది. ఇప్పుడు ఆ జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేరింది. రెండు వారాల్లో రూ.1000 కోట్లు గ్రాస్‌ వసూలు చేసిన మూడో చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్‌ సృష్టించింది. ఈ విషయంపై చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘ప్రేక్షకుల్ని అలరించేందుకు మావంతు ప్రయత్నం చేశాం. మీరు వెలకట్టలేని ప్రేమను పంచారు. అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి  25న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే




Updated Date - 2022-04-11T01:20:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!