‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ అంటే అట్లుంటది మరి.. థియేటర్ యజమానులకు అంత భయమా?
ABN, First Publish Date - 2022-03-21T05:30:00+05:30
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని కోసం థియేటర్లు వినూత్న రీతిలో ముస్తాబు అవుతున్నాయి. మామూలుగా స్టార్ హీరో సినిమా విడుదల అంటే అభిమానులు థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు కట్టి గజమాలలతో అలంకరిస్తారు. పాలాభిషేకాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల అంటే థియేటర్ల దగ్గర వీటితోపాటు కొత్త ఏర్పాటు కనిపిస్తున్నాయి
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీని కోసం థియేటర్లు వినూత్న రీతిలో ముస్తాబు అవుతున్నాయి. మామూలుగా స్టార్ హీరో సినిమా విడుదల అంటే అభిమానులు థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు కట్టి గజమాలలతో అలంకరిస్తారు. పాలాభిషేకాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల అంటే థియేటర్ల దగ్గర వీటితోపాటు కొత్త ఏర్పాటు కనిపిస్తున్నాయి. పైగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతకుమించి ఇద్దరు హీరోల అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. దానికోసం థియేటర్ యాజమాన్యం భద్రత కట్టుదిట్టం చేస్తారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ విడుదల కోసం ఓ థియేటర్ ఎలా ముస్తాబు అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో అభిమానులు స్ర్కీన్ దగ్గరకు వెళ్లకుండా పోడియంపై మేకులు బిగించారు. మరో థియేటర్‌లో ఆడియన్స్ స్ర్కీన్ దగ్గరకు వెళ్లకుండా పొలం చెట్టూ కంచె వేసిన మాదిరి తెర ముందు పెన్సింగ్ వేశారు. ఇద్దరు హీరోలతో దర్శకధీరుడు తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల అంటే అట్లుంటది మరి’ అంటున్నారు అభిమాను. ప్రస్తుతం ఆ థియేటర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.