సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాకంటే మీకు తారక్‌–చరణ్‌ అంటేనే ఇష్టం: రాజమౌళితో ప్రభాస్‌

ABN, First Publish Date - 2022-03-10T22:57:21+05:30

చరణ్‌–తారక్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ చిత్రం తీశారు! అందులో నన్ను అతిథి పాత్రలో అయినా చూపించాలని అనిపించలేదా? నేను–చరణ్‌–తారక్‌ స్ర్కీన్‌ మీద బావుండేది కదా? మీకు ఆ ఆలోచన రాలేదా.. అసలు అలా అనిపించలేదా.. మీరనుకున్న విజన్‌లో నేను ఎక్కడా కనిపించలేదా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చరణ్‌–తారక్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ చిత్రం తీశారు!

అందులో నన్ను అతిథి పాత్రలో అయినా చూపించాలని అనిపించలేదా?

నేను–చరణ్‌–తారక్‌ స్ర్కీన్‌ మీద బావుండేది కదా? 

మీకు ఆ ఆలోచన రాలేదా.. అసలు అలా అనిపించలేదా.. 

మీరనుకున్న విజన్‌లో నేను ఎక్కడా కనిపించలేదా?

కావాలనిపిస్తే మీరే ఓ పాత్రను క్రియేట్‌ చేయగలరు కదా? 


ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ దర్శకధీరుడు రాజమౌళిని అడిగిన ప్రశ్నలివి. ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్‌లో భాగంగా  రాజమౌళి హీరో ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేశారు. అందులో వీరిద్దరి సంభాషణలు సరదాగా సాగాయి. ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ప్రభాస్‌ పలు ప్రశ్నలు సంధించారు. 


చరణ్‌–తారక్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ చిత్రం తీశారు!

అందులో నన్ను అతిథి పాత్రలో అయినా చూపించాలని అనిపించలేదా?

నేను–చరణ్‌–తారక్‌ స్ర్కీన్‌ మీద కనిపిస్తే బావుండేది కదా? 

మీకు ఆ ఆలోచన రాలేదా.. అసలు అలా అనిపించలేదా.. 

మీరనుకున్న విజన్‌లో నేను ఎక్కడా కనిపించలేదా?

కావాలనిపిస్తే మీరే ఓ పాత్రను మీరు క్రియేట్‌ చేయగలరు కదా? 

ఈ ప్రశ్నలకు రాజమౌళి తెలివిగా సమాధానమిచ్చారు. ‘‘నువ్వు పెద్ద షిప్‌లాంటోడివి. రాసుకున్న సీన్‌లో పెద్ద షిప్‌ని తీసుకొస్తే బ్రహ్మాండంగా సీన్‌ వస్తుంది అనుకుంటే ఆ షిప్‌ను తీసుకొచ్చి పెడతాను. నేను అడిగితే ప్రభాస్‌ వచ్చి చేసేస్తాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇరికిస్తే సినిమా బాగోదు. నిజంగా సినిమాకు అవసరం అనుకుంటే ఎంత బిజీగా ఉన్నా.. కన్విన్స్‌ చేసి తీసుకొస్తాను’’ అని రాజమౌళి అన్నారు. 


దీనికి కౌంటర్‌గా ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘నాకు మాత్రం ఒకటి అర్థమైంది.. నాకంటే మీకు చరణ్‌–తారక్‌ అంటేనే ఇష్టం. అది స్పష్టంగా తెలుస్తోంది’’ అన్నారు. 

రాజమౌళి: డార్లింగ్‌.. ఆ సినిమా చేసిన్నప్పుడు ఆ హీరోల కంటే ఎవరూ ఎక్కువ కాదు. 


ప్రభాస్‌: తారక్‌తో యమదొంగ చేస్తున్నప్పుడు తారక్‌ మీదే మూడు కథలు చెప్పేవారు. అవన్నీ విని నెక్ట్స్‌ ఛాన్స్‌ నాకు ఎప్పుడో అనుకునేవాడిని. నాతో ‘ఛత్రపతి’ చేసేటప్పుడు ఇలాంటి కథే నీ కోసం ఇంకోటి ఉంది అన్నారు. ‘బాహుబలి’ చేస్తున్నప్పుడు మూడు కథలు చెప్పారు. దీనిని బట్టి నాకు ఒకటే అర్థమైంది. ఈయన ఒక హీరోతో సినిమా చేస్తున్నప్పుడు రెండు మూడు కథలు మైండ్‌లో ఉంటాయి. అయితే అవన్నీ అయ్యేదాకా గ్యారెంటీ లేదని ‘బాహుబలి’తో క్లారిటీ వచ్చేసింది. 


Updated Date - 2022-03-10T22:57:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!