వాయిదా వేశారు!
ABN, First Publish Date - 2022-01-25T05:53:59+05:30
కరోనా కారణంగా మరో సినిమా విడుదల వాయిదా పడింది. అడవి శేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘మేజర్’ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని...
కరోనా కారణంగా మరో సినిమా విడుదల వాయిదా పడింది. అడవి శేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘మేజర్’ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ దేశంలో పలు చోట్ల నైట్ కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని ఆ రోజు విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తామనీ, అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని కోరారు. ‘మనలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటేనే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క ‘మేజర్’ చిత్రాన్ని రూపొందించారు. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.