ఆకట్టుకుంటున్న ‘కథలు (మీవి మావి)’ పడవ మోషన్ పోస్టర్..
ABN, First Publish Date - 2022-03-23T23:06:24+05:30
దిల్ రాజు నిర్మాణంలో యంగ్ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్. ప్రస్తుతం ఆయన 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్ ద్వారా
దిల్ రాజు నిర్మాణంలో యంగ్ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్. ప్రస్తుతం ఆయన 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్ ద్వారా త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్ నుండి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదల చేసి దర్శకుడు వేగేశ్న సతీష్‌కు అలాగే టీం అందరికీ విషెస్ చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బ జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.
తాజాగా ఈ సిరీస్ నుండి మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథలు చిత్రీకరణను జరుపుకోనున్నాయి. త్వరలోనే వేగేశ్న సతీష్ 'కథలు' ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా తాజాగా వదిలిన పడవ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.