సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sindhooram: పాట ‘ఓ మాదిరిగా’.. ఉంది సూపర్బ్‌గా..

ABN, First Publish Date - 2022-12-08T16:42:58+05:30

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సింధూరం’ (Sindhooram). రీసెంట్‌గా ఈ సినిమాలోని మొదటి పాట.. ‘ఆనందమో ఆవేశమో’ను మేకర్స్ విడుదల చేయగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సింధూరం’ (Sindhooram). రీసెంట్‌గా ఈ సినిమాలోని మొదటి పాట.. ‘ఆనందమో ఆవేశమో’ను మేకర్స్ విడుదల చేయగా.. శ్రోతల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. విడుదలైన తక్కువ సమయంలో మంచి ఆదరణ పొందడమే కాకుండా 1 మిలియన్ ప్లస్ వ్యూస్ ఆ పాట సాధించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటను సక్సెస్‌ఫుల్ దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగిన ఈ పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.


‘‘కలలా కలిసే.. కలలే మురిసే..

నిదుర పోతే.. నువ్వు వస్తావని..

నాతో కలిసి.. నువ్ నడిచేటి..

రాస్తా నీ కోసం.. ఎదురే చూసి

ఓ మాదిరిగా సాగే నా జీవితం..

ఓహో అని అనిపించావే నువ్వో అద్భుతం’’ అంటూ సాగిన ఈ పాట విడుదల అనంతరం దర్శకుడు పరశురామ్ (Parasuram) మాట్లాడుతూ.. పాట చాలా బాగుందని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని, ఖచ్చితంగా ఈ పాట కూడా మ్యూజికల్ హిట్ అవుతుందని, చార్ట్‌బస్టర్స్‌లో నిలుస్తుందని.. డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా మరియు టీమ్ అంతా ఆశిస్తున్నారు. (Ohh Madhiriga Saagey Lyrical From Sindhooram)



Updated Date - 2022-12-08T16:42:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!