సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa Craze: తగ్గేదే లే అంటున్న న్యూయార్క్ మేయర్.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-10-12T16:36:28+05:30

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, యువ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, యువ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని డైలాగులకి అయితే.. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. అందులో తగ్గేదే లే డైలాగ్‌కి అయితే ఎంతోమంది రీల్స్ షాట్ వీడియోస్ కూడా చేశారు. ఈ మూవీ విడుదలై  పది నెలలు దాటింది. తాజాగా ఈ డైలాగ్‌కి, యాక్షన్‌కి న్యూయార్స్ నగర మేయర్ (Mayor) కూడా ఫిదా అయ్యారు. యాంకర్ అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) తో కలిసి ఆ గెస్చర్ చేసి చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దసరా సందర్భంగా న్యూయార్క్‌లోని తెలుగు సంఘం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ హాజరయ్యారు. అలాగే.. ముఖ్య అతిథిగా ఆ నగర మేయర్ హాజరయ్యి.. తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మని పండుగలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే అనసూయతో కలిసి తగ్గేదే లే అని పుష్ప గెస్చర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని న్యూయార్స్ మేయర్ కార్యాలయ అధికారిక ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై ఓ అభిమాని ట్వీట్టర్ స్పందిస్తూ.. ‘మా భారతీయ చిత్రం పుష్పపై ప్రేమని, అభిమానాన్ని చూపించినందుకు న్యూయార్స్ మేయర్‌కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయకి, మంగ్లీకి ధన్యవాదాలు’ అంటూ ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో రాసుకొచ్చారు.


కాగా.. ‘పుష్ప ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో ‘పుష్ప ది రూల్’ కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో జంటగా నటించిన అల్లు అర్జున్‌కి, రష్మిక మందన్నా దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ తరుణంలోనే ఈ మూవీ షూటింగ్‌కి త్వరలోనే ప్రారంభించి ఏకధాటిగా చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



Updated Date - 2022-10-12T16:36:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!