మానవాళి చరిత్రలో ఎప్పుడూ లేదు
ABN, First Publish Date - 2022-07-25T06:12:51+05:30
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దోషి’. మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ కథానాయికలు. సీఎస్.అముదన్ దర్శకుడు...
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దోషి’. మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ కథానాయికలు. సీఎస్.అముదన్ దర్శకుడు. కమల్ బోరా, ధనుంజయన్, ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. ఆదివారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘మానవాళి చరిత్రలో కనీ వినీ ఎరుగని క్రైమ్ డ్రామా ఈ కథ. ‘దోషి’ ఎవరు, అసలు తను చేసిన నేరమేంటి? అనేది ఆసక్తికరం. ‘తమీజ్ పాడమ్’ లాంటి వినోదాత్మక చిత్రాన్ని అందించిన దర్శకుడు... తొలిసారి క్రైమ్ జోనర్‌లో కథ తీశారు. ఆయన ఈ కథని ఎలా నడిపాడో తెరపై చూడండి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. జగన్, నిళల్‌గల్ రవి, జాన్ మహేంద్రన్, కలై రాణి తదితరులు నటించారు. సంగీతం: కణ్ణన్.