సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభుత్వాలపై ఆధారపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో కొత్త గా ఆలోచిద్దాం : నాగబాబు

ABN, First Publish Date - 2022-02-28T17:42:49+05:30

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ చిత్రం విషయంలో కక్ష పూరితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఆయన హీరోలకు, నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తూ కొన్ని సూచనలు అందించారు. నాగబాబు మాట్లాడుతూ.. హీరోలకు, నిర్మాతలకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లకు నా విజ్ఞపి ఏమిటంటే లాస్ అవుతాం. కానీ చచ్చిపోయెంత లాస్ కాదు కదా. ఆంధ్రా వరకూ నెట్ ఫ్లెక్స్ అమెజాన్ లలో రిలీజ్ చేద్దాం. ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా డబ్బులు ఎలా సంపదించాలో కొత్త గా ఆలోచిద్దాం. ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఆశ తగ్గించు కొని యూనిటీ గా వుంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం వీళ్ళకు భయపడితే చిన్న కార్మికులు రోడ్డున పడతారు. థియేటర్ యజమానులు కూడా అన్ని అనుమతులు తీసుకొని వుండండి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయరు. జగన్ ప్రభుత్వం వున్నంత వరకు అక్కడ సినిమాలు రిలీజ్ చేయవద్దు. అయిదు రూపాయల టిక్కెట్ రేటు కు అమ్మినా, ఓటిటి లో అమ్ముకుంటే మీ డబ్బులు వచ్చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మనల్ని స్వాగతిస్తుంది. వ్యక్తిగత పగ అలాంటివేమీ పెట్టుకోని ప్రభుత్వం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ చిత్రం విషయంలో కక్ష పూరితంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్  నాగబాబు మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఆయన హీరోలకు, నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తూ కొన్ని సూచనలు అందించారు. నాగబాబు మాట్లాడుతూ.. హీరోలకు, నిర్మాతలకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లకు నా విజ్ఞపి ఏమిటంటే లాస్ అవుతాం. కానీ చచ్చిపోయెంత లాస్ కాదు కదా. ఆంధ్రా వరకూ నెట్ ఫ్లెక్స్ అమెజాన్ లలో రిలీజ్ చేద్దాం. ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా డబ్బులు ఎలా సంపదించాలో కొత్త గా ఆలోచిద్దాం. ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఆశ తగ్గించు కొని యూనిటీ గా వుంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం వీళ్ళకు భయపడితే చిన్న కార్మికులు రోడ్డున పడతారు. థియేటర్ యజమానులు కూడా అన్ని అనుమతులు తీసుకొని వుండండి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయరు. జగన్ ప్రభుత్వం వున్నంత వరకు అక్కడ సినిమాలు రిలీజ్ చేయవద్దు. అయిదు రూపాయల టిక్కెట్ రేటు కు అమ్మినా, ఓటిటి లో అమ్ముకుంటే మీ డబ్బులు వచ్చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మనల్ని స్వాగతిస్తుంది. వ్యక్తిగత పగ అలాంటివేమీ పెట్టుకోని ప్రభుత్వం. 

కేసీఆర్ గారి మీదో కెటీఆర్ గారి మీదో మేము విమర్శలు చేశాం.  కాబట్టి మీ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అని ఎప్పుడూ అనలేదు. రాజకీయం తెలిసిన వాళ్ళు... సినిమాని సినిమా గా, రాజకీయాన్ని రాజకీయంగా చూస్తారు. వైసిపి ప్రభుత్వం చేసే అన్యాయం పై మనం ఫైట్ చేద్దాం. గళం విప్పుదాం. అవసరం అయితే కోర్టు కెళ్దాం. వెల్లంపల్లి శ్రీను, కొడాలి నాని ఇలాంటి కొందరు సంకుచిత వ్యక్తులను ఏమీ చేయలేము. మెగా ఫ్యాన్స్ కూడా ఆవేశ పడొద్దు. ఆ ఆవేశాన్ని తగ్గించుకోండి. టైమ్ వచ్చినప్పుడు సమాధానం చెబుదాం. కాలం ఎప్పుడు ఒకేలా వుండదు. ఎప్పుడూ వైసిపి ప్రభుత్వం రూల్ చేయదు. మా హీరోలు న్యాయమైన సంపాదన చేస్తున్నారు. అధికారం లో వున్న రాజకీయ నాయకులు అవలీలగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రతీ హీరో టాక్స్ లు కడుతున్నారు.  మంచి పనులు చేస్తున్నారు. కష్ట పడుతున్నారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి లక్షలాది మందికి సేవ చేస్తున్నారు. బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను వాళ్ళ నాన్నగారి హయాం నుంచి పెట్టి..  ఈ రోజు వరకూ రన్ చేస్తున్నారు. మహేష్ బాబు ఎన్నో ఊర్లను దత్తత తీసుకొని సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమేమి చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. ఎల్లకాలం వైసిపి ప్రభుత్వం వుంటుందని భ్రమ పడకండి. మా సినిమా వాళ్లకు పగ, ప్రతీకారాలు వుండవు. విధానాల పరంగానే గానీ ఫైట్ చేస్తాం, కానీ వ్యక్తిగతంగా ఫైట్ చెయ్యం. చిరంజీవి గారికి మాకు విభేదాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అయన పెద్ద మనిషి. చిరంజీవి గారు మంచిగా మాట్లాడినప్పుడు మీరు మంచిగా చేసుంటే మేము ఇప్పుడు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని విబేధించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తారా? మీతో కలవలేదు కాబట్టి మహేష్, ప్రభాస్ లాంటి వాళ్ళను కార్నర్ చేస్తారా? సినిమా వాళ్ళను టార్గెట్ చెయ్యొద్దు. ఉద్యోగస్తులు అడుగుతున్నవి ఇవ్వండి. మత్స్యకారులు అడుగుతున్నవి ఇవ్వండి. ఇంకా రెండేళ్లు సమయం మీకు వుంది. సినిమా వాళ్ల మీద ఫోకస్ పెట్టకండి. అవసరం అయితే తలా లక్షరూపాయలు వేసుకొని సినీ కార్మికులను ఆదుకుంటాము. వైసిపి లో నాకు మంచి స్నేహితులు వున్నారు. జగన్ గారు మీకు వున్న విషయం చెపుతున్నాను తప్పుగా తీసుకోకండి. మంచి పరిపాలన చేయండి’..  అని నాగబాబు వ్యాఖ్యానించారు.  

Updated Date - 2022-02-28T17:42:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!